AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోనియా గాంధీకి ఇష్టమైన జామ్.. రాహుల్ స్పెషల్‌గా చేసిన సూపర్ రెసిపీ ఇదిగో.. చాలా సింపుల్..

ఆరెంజ్‌లో విటమిన్ సీతోపాటు.. ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఈ నారింజ పండు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. అయితే.. నారింజతో చేసుకునే.. ఆరెంజ్ మార్మలేడ్ సూపర్ రెసిపీ.. ఇది బ్రెడ్, చపాతీలతో చాలా రుచిగా, అద్భుతంగా ఉంటుంది. ఎన్నో పోషకాలు దాగున్న ఆరెంజ్ మార్మలేడ్ .. సోనియా గాంధీకి చాలా ఇష్టమైన జామ్.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

సోనియా గాంధీకి ఇష్టమైన జామ్.. రాహుల్ స్పెషల్‌గా చేసిన సూపర్ రెసిపీ ఇదిగో.. చాలా సింపుల్..
Orange Marmalade
Shaik Madar Saheb
|

Updated on: May 06, 2026 | 8:32 PM

Share

ఆరెంజ్ మార్మలేడ్ (Orange Marmalade) అనేది నారింజ పండు గుజ్జు, తొక్కల మిశ్రమంతో చేసే ఒక రకమైన జామ్. ఇది బ్రెడ్, చపాతీలతో చాలా రుచిగా, అద్భుతంగా ఉంటుంది. విటమిన్ సీ, కాల్షియంతోపాటు.. పలు పోషకాలు దాగున్న ఆరెంజ్ మార్మలేడ్ .. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి చాలా ఇష్టమైన జామ్.. అందుకే.. ఆమె కుమారుడు.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ నూతన సంవత్సరం సందర్భంగా.. ఈ స్పెషల్ రెసిపీని స్వయంగా చేశారు. ప్రియాంక గాంధీ రూపొందించిన రెసిపీని అనుసరించి, రాహుల్ గాంధీ ఈ జామ్‌ను సిద్ధం చేసి.. సోనియా గాంధీకి అందించారు. మర్మలేడ్ తయారీ ప్రక్రియలో, నారింజలను కోసి, తొక్క తీసి, చిన్న మంటపై 25 నిమిషాల పాటు ఉడికించారు. ఈ వీడియో “అమ్మ జ్ఞాపకాలు – మార్మలేడ్” అనే శీర్షికతో విడుదల చేయగా అప్పట్లో వైరల్ అయింది.

ఈ అద్భుతమైన రెసిపీ ఆరెంజ్ మార్మలేడ్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

దీనిని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు..

కావలసిన పదార్థాలు:

నారింజ పండ్లు: 3 లేదా 4 (సుమారు 500 గ్రాములు)

చక్కెర: 500 గ్రాములు (పండ్ల పరిమాణాన్ని బట్టి సమానంగా తీసుకోవాలి)

నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్ (జామ్ గడ్డకట్టకుండా ఉండటానికి)

నీళ్లు: అవసరమైన మేరకు (సుమారు 1 లీటరు)

తయారీ విధానం:

ముందుగా నారింజ పండ్లను శుభ్రంగా కడిగి, పీల్ చేయాలి. ఆ తొక్కల లోపల ఉండే తెల్లని పొరను (pith) వీలైనంత వరకు తీసివేసి, తొక్కలను చాలా సన్నని ముక్కలుగా (thin strips) కోసుకోవాలి.

పండ్ల రసం: పండ్ల నుంచి గింజలను తీసివేసి, రసం తీయాలి. అందులో ఉండే గుజ్జును (pulp) కూడా వాడుకోవచ్చు.

ఉడికించడం: ఒక మందపాటి గిన్నెలో నీళ్లు పోసి, అందులో సన్నగా తరిగిన నారింజ తొక్కలను వేయాలి. తొక్కలు మెత్తబడే వరకు సుమారు 30 నిమిషాల పాటు ఉడికించాలి.

చక్కెర కలపడం: తొక్కలు మెత్తబడ్డాక, అందులో నారింజ రసం, చక్కెర వేయాలి. చక్కెర పూర్తిగా కరిగి మిశ్రమం చిక్కబడే వరకు (సుమారు 20-30 నిమిషాలు) మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.

నిమ్మరసం: చివరగా నిమ్మరసం వేసి కలపాలి. మిశ్రమం జెల్లీ లాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపివేయాలి.

ఒక ప్లేటులో కొద్దిగా మార్మలేడ్ వేసి చూస్తే, అది పక్కకు జారకుండా స్థిరంగా ఉంటే పర్ఫెక్ట్ గా తయారైనట్లు.

అయితే.. నారింజ తొక్కలోని తెల్లని పొర చేదుగా ఉంటుంది, కాబట్టి దానిని పూర్తిగా తీసివేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో పోసి నిల్వ ఉంచుకుంటే 3 నుండి 4 నెలల వరకు తాజాగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us