Tollywood : యూట్యూబ్ వదిలి సినిమాల కోసం ట్రై చేసి పొరపాటు చేశా.. ఆ ఒక్క సిరీస్ నా జీవితాన్ని మార్చేసింది.. టాలీవుడ్ నటుడు..
యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫేమస్ అయిన సెలబ్రెటీస్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు చిన్న చిన్న సిరీస్ చేసిన వారు ఇప్పుడు హీరోహీరోయిన్లలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాను యూట్యూబ్ పూర్తిగా వదిలేసి కేవలం సినిమాల కోసం ప్రయత్నించడం పెద్ద పొరపాటు అని అన్నారు ఓ టాలీవుడ్ నటుడు. ఇప్పుడిప్పుడే తనదైన కామెడీ టైమింగ్, నటనతో ఆకట్టుకుంటున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా..

తెలుగు నటుడు రవి శివ తేజ ఇప్పుడిప్పుడే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, పరిశ్రమలో మార్పులపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో ఉన్న ఆయన, తన పక్కన ఉండి, కలిసి ప్రయాణించి ఈరోజు స్టార్ గా ఉన్నవారిలో కిరణ్ అబ్బవరం, వైష్ణవి చైతన్య, దర్శకుడు గోపీనాథ్ రెడ్డి, మౌనిక, కామెడియన్ బబ్లు వంటి వారని గుర్తు చేసుకున్నాడు. కిరణ్ అబ్బవరం ఒక స్టార్ అయినప్పటికీ, ఎటువంటి అహంకారం లేకుండా అందరితో ఆప్యాయంగా మాట్లాడతాడని రవి శివ తేజ అన్నారు. కిరణ్ ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు తనకు వ్యక్తిగతంగా తెలుసని, అయినప్పటికీ అతను మంచోడని, సినిమాలతోనే సమాధానం చెబుతానని నిశ్చయించుకున్నాడని తెలిపారు. “నాకు పక్కన ఫ్రెండ్ క్యారెక్టరే కదరా” అని అడిగినా, “అన్నా, మంచిది చేద్దాం అన్నా, చిన్న చిన్న క్యారెక్టర్లు వద్దు మనకి” అని కిరణ్ పాజిటివ్ గా మాట్లాడతాడని రవి శివ తేజ వెల్లడించారు. కిరణ్ ఇటీవల నిర్మాతగా మారి తిమ్మరుసు బలి టీవీ తీయడం, అలాగే దర్శకత్వం వైపు అడుగులు వేయడం గొప్ప విషయమని ప్రశంసించారు.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..
తన కెరీర్ లో తన భార్య మద్దతు ఎంతో కీలకమని, ఆమె లేకపోతే తన జీవితం చాలా కష్టంగా ఉండేదని రవి శివ తేజ చెప్పారు. తన భార్యకు కేవలం పది రూపాయలు ఉంటే పది రూపాయలతో, వంద రూపాయలు ఉంటే వంద రూపాయలతో బతికే స్వభావం ఉందని తెలిపారు. గొప్ప దర్శకుడు విజయ భాస్కర్ కుమార్తె అయినప్పటికీ, ఆమెకు ఎలాంటి ఆశలు లేవని, కేవలం పక్కన ఉండి సంతోషంగా చూసుకుంటే చాలని కోరుకుంటుందని వివరించారు. తన భార్యకు మంచి ఫుడ్ అంటే చాలా ఇష్టమని, మిగతా వాటి కోసం ఎప్పుడూ అడగదని చెప్పారు. తన భార్య ఉండటం వల్లే తాను ధైర్యంగా షూటింగులకు వెళ్లగలుగుతున్నానని, తనను తాను మరింత అన్వేషించుకోగలుగుతున్నానని అన్నారు. అవకాశాల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని రవి శివ తేజ అన్నారు. నిర్మాతలు, దర్శకులను కలవడానికి ఎటువంటి ఈగో లేదని, నిరాకరణను కూడా తాను స్వీకరిస్తానని, అది పాత్రకు తాను సరిపోలేదని మాత్రమే భావిస్తానని తెలిపారు. తెలంగాణ స్లాంగ్ వల్ల కొన్ని పాత్రలు చేజారిపోయాయని, దర్శకులు తమ గురించి నిలబడగలిగితే మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..
2018లో యూట్యూబ్ ను వదిలి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి పొరపాటు చేశానని రవి శివ తేజ చెప్పుకొచ్చారు. అప్పట్లో జనాల మర్చిపోవడం, కోవిడ్ వంటి కారణాలతో కెరీర్ క్లోజ్ అనుకున్న సమయంలో సూర్య వెబ్ సిరీస్ తన జీవితాన్ని మార్చిందని చెప్పారు. ఆ వెబ్ సిరీస్ విజయం తనను మళ్లీ పైకి తీసుకొచ్చిందని, అందుకే యూట్యూబ్‌ను ఎప్పుడూ వదలకూడదని నిర్ణయించుకున్నానని, స్టార్ అయినా నెలకు మూడు, నాలుగు వీడియోలు తప్పకుండా చేస్తానని స్పష్టం చేశారు. తనతో విరాజితతో పాటు దీక్షికా జాదవ్ తో కూడా తన జోడిని ప్రేక్షకులు బాగా ఆదరించారని రవి శివ తేజ సంతృప్తి వ్యక్తం చేశారు.
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..
