Bigg Boss 8 Telugu: రెండో వారం బిగ్ బాస్ ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్! ఎవరూ ఊహించని కంటెస్టెంట్ బయటకు!
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ రియాలిటీ అప్పుడే రెండు వారం ఆఖరికి వచ్చేసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్స్ అంటే హోస్ట్ బిగ్ బాస్ నాగార్జున సందడి ఉంటుంది. అలాగే కొందరు సెలబ్రిటీలు కూడా హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్లను కలిసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది.
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ రియాలిటీ అప్పుడే రెండు వారం ఆఖరికి వచ్చేసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్స్ అంటే హోస్ట్ బిగ్ బాస్ నాగార్జున సందడి ఉంటుంది. అలాగే కొందరు సెలబ్రిటీలు కూడా హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్లను కలిసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది. మొదటి వారంలో బేబక్క హౌస్ నుంచి బయటకు రాగా.. రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. రెండో వారం ఎలిమినేషన్స్‌కి సంబంధించి.. మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. విష్ణు ప్రియ, నిఖిల్, మణికంఠ, నైనిక, శేఖర్ బాషా, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, పృథ్వీ నామినేషన్స్ జాబితాలో ఉన్నారు. బుధవారం రాత్రి నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. శుక్రవారం (సెప్టెంబర్ 13) తో ఓటింగ్ లైన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. రెండో వారం ఎలిమినేషన్స్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోనుందని సమాచారం. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ బయటకు వెళ్లనున్నాడని తెలుస్తోంది.
బిగ్ బాస్ ఎలిమినేషన్స్ కు సంబంధించి ఒకసారి ఓటింగ్ ను పరిశీలిస్తే విష్ణు ప్రియ, నిఖిల్‌లు టాప్ లో నిలిచారు.ని ఖిల్ 24 శాతం ఓట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, ఆ తరువాత 22 శాతం ఓట్లతో విష్ణు ప్రియ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మణికంఠ 13 శాతం ఓట్లు, నైనిక 10 శాతం, ఆర్జే శేఖర్ భాషా 8 శాతం ఓట్లతో ఉన్నారు. ఇక నటుడు ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, పృథ్వీ చెరో 7 శాతం ఓట్లు సాధించారు. అంటే ప్రస్తుతానికి వీరే డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
డేంజర్ జోన్ లో మొత్తం నలుగురు కంటెస్టెంట్స్..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
వీరిలో కిర్రాక్ సీతకు అంతో ఇంతో కొంచెం ఫాలోయింగ్ ఉంది కాబట్టి సేవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆదిత్య ఓం, పృథ్వీలలో ఎవరో ఒకరు ఈ వారం సూట్ కేసు సర్దుకోవాల్సిందే.
To all Disney Plus Hotstar Subscribers, Join the fun NOW! #BiggBossTelugu8 pic.twitter.com/hnVkx525g2
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 13, 2024
బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.