Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీలో బిగ్‏బాస్ 7 కంటెస్టెంట్.. ‘పవర్ స్టార్ అంటే పవర్ జనరేట్’ అంటోన్న శుభ శ్రీ..

ఒడిశాలో పుట్టిపెరిగిన శుభశ్రీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటుంది. ఎల్ఎల్బీ కోర్సు పూర్తిచేసి లాయర్ అయిన శుభశ్రీ మోడలింగ్ పై ఆసక్తి ఉండడంతో 2020లో వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా గెలిచింది. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాలు చేసిన ఆమె.. 2022లో రుద్రవీణ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది. అమిగోస్, కథ వెనక కథ వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో సందడి చేస్తోంది.

Bigg Boss 7 Telugu: పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీలో బిగ్‏బాస్ 7 కంటెస్టెంట్.. ‘పవర్ స్టార్ అంటే పవర్ జనరేట్’ అంటోన్న శుభ శ్రీ..
Pawan Kalyan, Subhashree Ra
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 07, 2023 | 4:18 PM

బిగ్‏బాస్ సీజన్ 7.. స్టార్ట్ అయ్యి వారం కూడా కాలేదు అప్పుడే ఇంట్లో గొడవలు, ఏడుపుల స్టార్ట్ అయ్యాయి. మరోవైపు ఇప్పుడిప్పుడే ఒకరికొకరి మధ్య ఫ్రెండ్ షిప్ మొదలైంది. ఈసారి ఉల్టా పుల్టాగా సాగే ఈ సీజన్ లో యంగ్ హీరోహీరోయిన్లను రంగంలోకి దించారు. అందులో శుభ శ్రీ రాయగురు ఒకరు. ఒడిశాలో పుట్టిపెరిగిన శుభశ్రీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటుంది. ఎల్ఎల్బీ కోర్సు పూర్తిచేసి లాయర్ అయిన శుభశ్రీ మోడలింగ్ పై ఆసక్తి ఉండడంతో 2020లో వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా గెలిచింది. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాలు చేసిన ఆమె.. 2022లో రుద్రవీణ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది. అమిగోస్, కథ వెనక కథ వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో సందడి చేస్తోంది. నాకు తెలుగు రాదూ.. తెలివి మాత్రం ఉంది అంటూ బిగ్‏బాస్ స్టేజ్ పై చెప్పిన శుభశ్రీ.. ఇప్పుడైతే ఇంట్లో పర్వలేదనట్టుగానే ఉంది.

తెలుగు పూర్తిగా మాట్లాడటం రాకపోయిన ఇతర కంటెస్టెంట్స్ తో తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. శుభశ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రంలో నటించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శుభశ్రీ పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. పవన్ నటిస్తోన్న ఓజీ చిత్రంలో శుభశ్రీ కీలకపాత్ర పోషించింది. పవర్ స్టార్ తో స్క్రీన్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని.. ఓజీ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సినిమా చాలా స్టైలిష్ గా ఉంటుందని.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని.. పవర్ స్టార్ అంటే..పవర్ జనరేట్ చేస్తున్నట్లే ఉందని.. ఆయన యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ ఉంటుందని.. కళ్లలోనే పవర్ ఉంటుందని.. ఇంకా ఆయన వాకింగ్ స్టైల్ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇక తనకు వ్యాపారరంగంలో అడుగుపెట్టాలని ఉందని.. ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని.. బిగ్‏బాస్ హౌస్ లో తన చేతి చికెన్ కర్రీ రుచి చూపిస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బిగ్‏బాస్ హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ తో చూస్తే శుభశ్రీ కాస్త యాక్టివ్ గానే ఉన్నట్లే తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.