Bigg Boss 7 Telugu: ‘థూ.. అనేంత తప్పు ఏం చేశాడు.. చూస్తుంటే మా రక్తం ఉడికిపోయింది’.. భోలే షావలి తల్లి కన్నీళ్లు..
శోభా, ప్రియాంక అరుస్తూ భోలే మీద మీదకు వెళ్లగా.. అదే సమయంలో నోరు జారాడు భోలే. దీంతో ఆ ఇద్దరి ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే ప్రియాంక అతడిని చూస్తూ థూ అంటూ చీదరించుకుంది. కానీ అప్పటికీ భోలే నిదానంగా మాట్లాడుతూ.. అదే తిరిగి థూ అని ఊస్తే నీ బతుకు ఏం కావాలి అంటూ కౌంటరిచ్చాడు. అయితే వీరి మధ్య జరిగిన గొడవ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భోలే షావలితో ప్రియాంక, శోభా శెట్టి ప్రవర్తించిన తీరు దారుణమంటూ అతడి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

బిగ్బాస్ సీజన్ 7 ఏడో వారం నామినేషన్స్ రచ్చ ఏ రేంజ్లో జరిగిందో చూశాం. శోభా శెట్టి, ప్రియాంక వర్సెస్ భోలే. వీరి ముగ్గురి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. సీరియల్ బ్యాచ్ మొత్తం భేలేను టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారు. శోభా, ప్రియాంక అరుస్తూ భోలే మీద మీదకు వెళ్లగా.. అదే సమయంలో నోరు జారాడు భోలే. దీంతో ఆ ఇద్దరి ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే ప్రియాంక అతడిని చూస్తూ థూ అంటూ చీదరించుకుంది. కానీ అప్పటికీ భోలే నిదానంగా మాట్లాడుతూ.. అదే తిరిగి థూ అని ఊస్తే నీ బతుకు ఏం కావాలి అంటూ కౌంటరిచ్చాడు. అయితే వీరి మధ్య జరిగిన గొడవ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భోలే షావలితో ప్రియాంక, శోభా శెట్టి ప్రవర్తించిన తీరు దారుణమంటూ అతడి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమ్మాయిల ముందు అలా బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ ప్రియాంక అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ నామినేషన్స్ గొడవపై భోలే షావలి తల్లి, సోదరి స్పందించారు. తన కొడుకును అనవసరంగా తిడుతున్నారని. థూ అనేంత తప్పు అతను ఏం చేశాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు భోలే తల్లి.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నా కొడుకు మంచి మనసున్నవాడు. పది మందికి అన్నం పెట్టే వాడిని హౌస్ లో అలా చేస్తారనుకోలేదు. నా కొడుకును ప్రియాంక థూ అని ఎందుకు అన్నదో అర్థం కావడం లేదు. నా కొడుకు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్లినా నా కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. అతడితో హౌస్ లో ఎవరూ మాట్లాడట్లేదు. తన కలుపుకుపోదామని చూస్తున్నా వాళ్లు దూరం పెడుతున్నారు.” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
View this post on Instagram
అనంతరం భోలే సోదరి మాట్లాడుతూ ” అందరినీ ప్రేమిస్తాడు. కానీ తన మంచితనాన్ని ఓర్వలేకపోతున్నారు. అతిగా మాట్లాడం.. నటించడం రాదు. సీరియల్ బ్యాచ్ మా అన్నయ్యను కావాలని టార్గెట్ చేస్తున్నారు. థూ అనేంత తప్పు తనేం చశాడు. అతడి మీద మీద పడి అరుస్తున్నారు. అంత అవసరం లేదు కదా. ఆ ఎపిసోడ్ చూస్తుంటే మా రక్తం ఉడికిపోయింది. కానీ ఏం చేయలేకపోయాం. ప్రియాంక, శోభా శెట్టి యాటిట్యూడ్ చూపిస్తున్నారు. మా అన్నయ్య ఏం మాట్లాడినా తప్పులాగే చూస్తున్నారు. వాళ్లెంత ఛీ కొట్టినా మా అన్నయ్య కూల్ గా మాట్లాడుతున్నాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








