Bigg Boss 7 Telugu: తెలంగాణ ఫోక్ సాంగ్‏కు అదరగొట్టేసిన అమర్ దీప్, ప్రియాంక జైన్.. వీడియో చూశారా ?..

ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ విషయంలో అమర్ దీప్ ప్రవర్తించిన తీరుతో పూర్తిగా నెగిటివిటీ సంపాదించుకున్నాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. అయితే ఈవారం మాత్రం అమర్ దీప్ తన ఆట తీరును పూర్తిగా మార్చేశాడు. సైలెంట్‏గా ఉంటూనే తన గేమ్ పై ఫోకస్ పెట్టాడు. ముఖ్యంగా శివాజీతో క్లోజ్ గా ఉంటూ టాస్కులలో 100 శాతం ఆడేందుకు ట్రై చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు అమర్ దీప్‏కు ఓటింగ్ కూడా ఎక్కువే అయ్యింది.

Bigg Boss 7 Telugu: తెలంగాణ ఫోక్ సాంగ్‏కు అదరగొట్టేసిన అమర్ దీప్, ప్రియాంక జైన్.. వీడియో చూశారా ?..
Amardeep, Priyanka Jain
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 14, 2023 | 5:29 PM

బుల్లితెరపై హీరో అమర్ దీప్. జానకి కలగనలేదు సీరియల్‏లో రామా పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తన నటనతో మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నాడు. ప్రస్తుతం అమర్ దీప్ బిగ్‏బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‏గా కొనసాగుతున్నాడు. నిజానికి ఈ షోలోకి విన్నర్ కంటెస్టెంట్‏గా వెళ్లిన అమర్ దీప్.. ఇప్పుడు జీరో అయ్యాడు. అందుకు కారణాలు లేకపోలేదు. తన సీరియల్ బ్యాచ్‏తో స్నేహం.. ఎదుటివాళ్ల కోసం తన గేమ్ కోసం తన ఆటను పక్కనపెట్టేశాడు. అనవసర విషయాల్లో కలగజేసుకుని అర్థంలేని వాదనతో రోజు రోజుకీ తన గ్రాఫ్ తగ్గించుకున్నాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ విషయంలో అమర్ దీప్ ప్రవర్తించిన తీరుతో పూర్తిగా నెగిటివిటీ సంపాదించుకున్నాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. అయితే ఈవారం మాత్రం అమర్ దీప్ తన ఆట తీరును పూర్తిగా మార్చేశాడు. సైలెంట్‏గా ఉంటూనే తన గేమ్ పై ఫోకస్ పెట్టాడు. ముఖ్యంగా శివాజీతో క్లోజ్ గా ఉంటూ టాస్కులలో 100 శాతం ఆడేందుకు ట్రై చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు అమర్ దీప్‏కు ఓటింగ్ కూడా ఎక్కువే అయ్యింది.

ఇదిలా ఉంటే.. గత రెండు మూడు రోజులుగా యూట్యూబ్‏లో అమర్ దీప్ కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతుంది. అదేంటంటే.. తెలంగాణ ఫోక్ సాంగ్‏లో నటించాడు అమర్ దీప్. అతనితోపాటు.. జానకి కలగలేదు ఫేమ్ ప్రియాంక జైన్ సైతం ఈ పాటలో అమర్ జోడిగా కనిపించింది. “తెల్ల తెల్లవారంగా తెల్లవారంగా.. తొలి పొద్దు రూపమే నీది బుజ్జమ్మ.. నల్ల నల్ల మబ్బుల్లా.. నల్ల మబ్బుల్లా.. నల్ల సాయిల పిలగా రారా కన్నయ్య” అంటూ సాగే ఈ ఫోక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఇందులో అమర్ దీప్, ప్రియాంక జైన్ ఇద్దరూ తమ డాన్స్ తో అదరగొట్టేశారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా బిగ్‏బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గా ఉన్నారు. అయితే బిగ్‏బాస్ షోకు వెళ్లకముందు ఈ సాంగ్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పాటను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు వీరిద్దరి ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఇక అమర్ దీప్ ఇప్పుడిప్పుడే గేమ్ ఫై ఫోకస్ చేసి తన గ్రాఫ్ పెంచుకున్నాడు. మరోవైపు ప్రియాంకకు సైతం మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ముక్కు సూటిగా మాట్లాడుతూ.. సోలోగా గేమ్ ఆడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో సీరియల్ బ్యాచ్ స్నేహంతో ప్రియాంకకు సైతం ట్రోలింగ్ తప్పడం లేదు. ఇదిలా ఉంటే.. ఆరోవారం హౌస్ రెండో కెప్టెన్ గా యావర్ గెలిచిన సంగతి తెలిసిందే.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!