AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బాబోయ్ అర్జున్.. SPY టీమ్‌ను విడదీయడమే అతని స్ట్రాటజీ..

శివాజీ యావర్ నథింగ్ అన్నప్పటి నుంచి తోడుగా నిలబడ్డాడు.. కానీ అర్జున్.. యావర్ కెప్టెన్ అయ్యాక కనీసం హగ్ ఇచ్చే ప్రయత్నం చెయ్యలేదు. మొత్తంగా అర్జున్ ఆట రోజురోజుకు మారుతోంది. అతని అసలు ఫేస్ స్లో.. స్లో గా రివీల్ అవుతుంది. ఏది ఏమైతేనేం.. బిగ్ బాస్ సీజన్ 7 రోజుకో ట్విస్టుతో అలా సాగిపోతుంది.

Bigg Boss 7 Telugu: బాబోయ్ అర్జున్.. SPY టీమ్‌ను విడదీయడమే అతని స్ట్రాటజీ..
Ambati Arjun
Ram Naramaneni
|

Updated on: Oct 14, 2023 | 4:40 PM

Share

అంబటి అర్జున్ గట్టి ప్లాన్‌తోనే బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లో శివాజీ బ్యాచ్ మధ్య చిచ్చు పెట్టడమే అతని స్ట్రాటజీగా తెలుస్తోంది. అందుకోసం అవకాశం చిక్కినప్పుడల్లా తన మైండ్ గేమ్‌ వాడుతున్నాడు. అందరికీ పనులు చెప్పావా అని కెప్టెన్ అయిన ప్రశాంత్‌ని అడిగి.. ఏదో అతనికి మంచి చేస్తున్నట్లు శివాజీకి కూడా పని చెప్పేలా చేశాడు. తాజాగా కెప్టెన్ అయిన యావర్‌‌ని కూడా శివాజీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. “నువ్వు బాగా ఆడుతున్నావనే ఇంట్లోని వాళ్లలో కొందరు నీకు సపోర్ట్ చేశారు. ఇది దృష్టిలో పెట్టుకో. వాళ్లు చెప్పారు. వీళ్లు చెప్పారు అని కాదు. నీలా నువ్వు ఉన్నావ్ కాబట్టి ముందుకు వెళ్తున్నావ్” అంటూ అర్జున్.. యావర్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు.

వాస్తవానికి శివాజీ ఏమి.. ప్రశాంత్, యావర్ బాగా ఆడతారని వారికి మద్దతుగా నిలబడలేదు. తొలి నుంచి వాళ్లు టార్గెట్‌గా సీరియల్ బ్యాచ్ రెచ్చిపోవడంతో.. తమ మైండ్‌కు పదును పెట్టి.. వారు ముందుకు వెళ్లేలా చేశాడు. ప్రశాంత్ కెప్టెన్ అవ్వడంలో ప్రత్యక్ష పాత్ర పోషించిన శివాజీ.. యావర్‌ను కెప్టెన్సీ బ్యాడ్జ్ అందుకోవడంలోనూ పరోక్ష పాత్ర పోషించాడు. అంతెందుకు. యావర్ మంచి కుర్రాడు.. వాడ్ని కూడా కెప్టెన్ చెయ్యాలని ముందు రోజు చెప్పాడు. వారి విజయాలను చూసి ఉప్పొంగిపోయాడు. మొత్తానికి SPY (శివాజీ-ప్రశాంత్-యావర్) టీమ్‌ను విడగొట్టి ఆటలో దూసుకుపోవడమే అర్జున్ ఎత్తుగడగా కనిపిస్తుంది. ఈ సంభాషణ అంతా లైవ్‌ చూసేవాళ్లకు అర్థమవుతుంది. ఎపిసోడ్ మాత్రమే చూస్తే.. ఈ కంటెంట్ అర్థం కాదు.

శివాజీ.. యావర్ నథింగ్ అన్నప్పటి నుంచి తోడుగా నిలబడ్డాడు.. కానీ అర్జున్.. యావర్ కెప్టెన్ అయ్యాక కనీసం హగ్ ఇచ్చే ప్రయత్నం చెయ్యలేదు. మొత్తంగా అర్జున్ ఆట రోజురోజుకు మారుతోంది. అతని అసలు ఫేస్ స్లో.. స్లో గా రివీల్ అవుతుంది. ఏది ఏమైతేనేం.. బిగ్ బాస్ సీజన్ 7 రోజుకో ట్విస్టుతో అలా సాగిపోతుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ భోళే శావలి..  కామెడీ అయితే అదుర్స్. అలాగని ఆయన కావాలని కామెడీ చేయడం లేదు. ఆయన ఏదో చెయ్యాలంటే ఇంకేదో అవుతుంది. మొత్తానికి ఈ క్యాండిడేట్ నెట్టింట తెగ ట్రోల్ అవుతున్నాడు. ప్రశాంత్, శివాజీ భజన చేస్తూ.. ఇంట్లో మరికొన్నాళ్లు ఉండే ప్రయత్నం చేస్తున్నాడు భోళే. మరి అతని ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుద్దో చూడాలి.

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.