Divya Prabha: విమానంలో నటికి లైంగిక వేధింపులు..! మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన నటి దివ్యప్రభ.
ప్రముఖ మలయాళ నటి దివ్య ప్రభకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక వేధింపులకు గురైంది. దివ్య.. మంగళవారం ముంబై నుంచి కొచ్చి కి ఎయిర్ ఇండియా AI 681 విమానంలో ప్రయాణించింది. ఆ సమయంలో పక్క సీటులో ఉన్న వ్యక్తి తనను వేధింపులకు గురి చేసినట్లు నటి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి 12 C సీటులో కూర్చున్నాడని తర్వాత తన సీటును 12Bకి మార్చుకుని, తన పక్క సీటు 12Aలోకి చేరాడని చెప్పింది.
ప్రముఖ మలయాళ నటి దివ్య ప్రభకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక వేధింపులకు గురైంది. దివ్య.. మంగళవారం ముంబై నుంచి కొచ్చి కి ఎయిర్ ఇండియా AI 681 విమానంలో ప్రయాణించింది. ఆ సమయంలో పక్క సీటులో ఉన్న వ్యక్తి తనను వేధింపులకు గురి చేసినట్లు నటి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి 12 C సీటులో కూర్చున్నాడని తర్వాత తన సీటును 12Bకి మార్చుకుని, తన పక్క సీటు 12Aలోకి చేరాడని చెప్పింది. విండో సీటు కోసం తనతో వాగ్వాదానికి దిగాడని తనను భౌతికంగా తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడని అంది. తను ఈ విషయాన్ని వెంటనే ఎయిర్ హోస్టెస్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పింది. దీంతో వారు విమానం టేకాఫ్‌కు కొద్ది సేపటికి ముందు తన సీటును మార్చారు కానీ, అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదనీ తెలిపింది. కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఈ విషయాన్ని విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్ ఇండియా ఆఫీస్ సిబ్బందికి చెప్పడంతో పోలీసుల సాయం పొందాలని వారు తనకు సూచించారని తెలిపింది. దీంతో తాను ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కేరళ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు నటి వివరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..