Action Scene: ఇజ్రాయెల్‌లో యాక్షన్ సినిమాను తలపించే సీన్.. వైరల్ అవుతున్న వీడియో.
ఇజ్రాయెల్ పై పెద్ద ఎత్తున దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లను పోలీసులు ఏరిపారేస్తున్నారు. సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ టెర్రరిస్టులను కనిపించిన చోటే కాల్చిపడేస్తున్నారు. ఈ క్రమంలో గాజా బార్డర్ లో ఇద్దరు హమాస్ మిలిటెంట్లు పోలీసుల దృష్టిలో పడ్డారు. ఓ కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఛేజ్ చేసి మరీ మట్టుబెట్టారు. ఓ కారులో ఇద్దరు పోలీసులతో పాటు బైక్ పై మరో ఆఫీసర్ వారిని వెంటాడారు.
ఇజ్రాయెల్ పై పెద్ద ఎత్తున దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లను పోలీసులు ఏరిపారేస్తున్నారు. సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ టెర్రరిస్టులను కనిపించిన చోటే కాల్చిపడేస్తున్నారు. ఈ క్రమంలో గాజా బార్డర్ లో ఇద్దరు హమాస్ మిలిటెంట్లు పోలీసుల దృష్టిలో పడ్డారు. ఓ కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఛేజ్ చేసి మరీ మట్టుబెట్టారు. ఓ కారులో ఇద్దరు పోలీసులతో పాటు బైక్ పై మరో ఆఫీసర్ వారిని వెంటాడారు. మిలిటెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదనే దృఢ నిశ్చయంతో హైవేపై దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ ఒక చేత్తో బైక్ నడుపుతూనే మరో చేతితో మిలిటెంట్లపై కాల్పులు జరిపాడు. రౌండ్లు రౌండ్లుగా కాల్పులు జరపగా.. కారు నడుపుతున్న మిలిటెంట్ కు బుల్లెట్ తగిలినట్లు గుర్తించారు. ఆ తర్వాత కాసేపటికే మిలిటెంట్లు ఉన్న కారు రోడ్డు పక్కన ఆగింది. అయినా ఇజ్రాయెల్ పోలీసులు వెనక్కి తగ్గలేదు.. కాల్పులు ఆపలేదు. బైక్ తో వెంటాడిన పోలీస్ ఆఫీసర్ తో పాటు కారులో వచ్చిన మరో ఇద్దరు పోలీసులు కొన్ని రౌండ్లు కాల్పులు జరపడంతో మిలిటెంట్లు చనిపోయారు. ఇదంతా బైక్ నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ యూనిఫాంకు అమర్చిన వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ఇజ్రాయెల్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

