Bigg Boss 7 Telugu: ‘శోభా.. నీకు ఎర్రగడ్డే దిక్కు’.. మోనితకు కౌంటరిచ్చిన భోలే.. శివంగిలా మారిన ప్రియాంక..

ఈరోజు విడుదలైన ఫస్ట్ ప్రోమోలో కన్నడ భామలు ప్రియాంక, శోభా శెట్టి పాటబిడ్డపై రెచ్చిపోయారు. నటిస్తున్నావ్.. నటిస్తున్నావ్ అంటూ అరిచి గోల చేశారు. ముఖ్యంగా భోలేను చూస్తూ థూ అంటూ నోరుజారింది ప్రియాంక. నువ్వు నన్ను థూ అన్నావ్.. అదే థూ నేను ఊస్తే నీ బతుకు ఏం కావాలి అంటూ గట్టిగానే ఇచ్చిపడేశాడు భోలే. ఇక ఇప్పుడు సెకండ్ ప్రోమోలో ఒక్కొక్కరికి చుక్కలు చూపించాడు పాటబిడ్డ. భోలే తనను నామినేట్ చేయడంతో సైకో మోనితగా మారిపోయింది శోభా శెట్టి. అటు ఇటు తిరుగుతూ అరుస్తూ నానా హంగామా చేసింది.

Bigg Boss 7 Telugu: 'శోభా.. నీకు ఎర్రగడ్డే దిక్కు'.. మోనితకు కౌంటరిచ్చిన భోలే.. శివంగిలా మారిన ప్రియాంక..
Bigg Boss 7 Telugu Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2023 | 6:04 PM

బిగ్‏బాస్ హౌస్ లో ఏడో వారం నామినేషన్స్ రచ్చ ఇంకా సాగుతునే ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో ప్రశాంత్ వర్సెస్ సందీప్ కాగా.. ఈరోజు భోలే వర్సెస్ శోభా, ప్రియాంక జరిగినట్లు తెలుస్తోంది. సీరియల్ బ్యాచ్ మొత్తం భోలేను నామినేట్ చేసిన సంగతి తెలిసింది. ఈరోజు విడుదలైన ఫస్ట్ ప్రోమోలో కన్నడ భామలు ప్రియాంక, శోభా శెట్టి పాటబిడ్డపై రెచ్చిపోయారు. నటిస్తున్నావ్.. నటిస్తున్నావ్ అంటూ అరిచి గోల చేశారు. ముఖ్యంగా భోలేను చూస్తూ థూ అంటూ నోరుజారింది ప్రియాంక. నువ్వు నన్ను థూ అన్నావ్.. అదే థూ నేను ఊస్తే నీ బతుకు ఏం కావాలి అంటూ గట్టిగానే ఇచ్చిపడేశాడు భోలే. ఇక ఇప్పుడు సెకండ్ ప్రోమోలో ఒక్కొక్కరికి చుక్కలు చూపించాడు పాటబిడ్డ. భోలే తనను నామినేట్ చేయడంతో సైకో మోనితగా మారిపోయింది శోభా శెట్టి. అటు ఇటు తిరుగుతూ అరుస్తూ నానా హంగామా చేసింది.

రెండో ప్రోమోలో.. అమర్ దీప్ ను నామినేట్ చేసింది అశ్విని. కుండపెట్టి కొట్టే ముందు ఒక్కసారి ఆలోచించి అప్పుడు కొట్టు అంటూ అమర్ దీప్ అనడంతో తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి బిగ్‏బాస్ పర్మిమిషన్ కోరింది. ఇక ఆ తర్వాత తన నెక్ట్స్ ఆప్షన్ అర్జున్ అని చెప్పడంతో ఫస్ట్ నా దగ్గరకే రావొచ్చు కదా.. అని అర్జున్ అనగా.. నీ దగ్గరకు ఏం వస్తాను. నిన్ను చూస్తేనే భయం వేస్తుంది అటు ఇటూ చేస్తావేమో అని అశ్విని అనేసింది. దీంతో ఏం చేస్తాను..హౌస్ లో నిన్నూ అంటూ సైటైర్ వేశాడు. ఇక ఈ ఆ తర్వాత శివాజీని నామినేట్ చేస్తూ ఫైర్ అయిపోయాడు గౌతమ్. చేతిలోని బ్యాట్ విసిరి కొడుతూ సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన భోలే మాత్రం శోభాను ఓ ఆటాడుకున్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

క్లాస్ నేర్పించొద్దు.. నామినేషన్స్ రీజన్స్ చెప్పండి అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది శోభా. దీంతో నీకు ఎర్రగడ్డే దిక్కు అంటూ కౌంటరిచ్చాడు భోలే. దీంతో నీకంటే పెద్ద మెంటల్ వాళ్లు ఉన్నారా ? ఈ హౌస్ లో అంటూ ఫైర్ అయ్యింది. ఆడవాళ్లు అయిపోయారురా.. ఎందుకురా ? అంటూ భోలే అనడంతో మధ్యలోకి దూరిపోయి శివంగిలా మారింది ప్రియాంక. ఆడవాళ్లు అని అనకు.. రెస్పెక్ట్ లేనప్పుడు వాడొద్దు అంటూ రెచ్చిపోయింది ప్రియాంక. నేను మాత్రమే నీ నిజస్వరూపాన్ని బయటకు తెచ్చాను. ఎక్కువ రోజులు దాచిపెట్టలేవ్ అంటూ రెచ్చిపోయింది శోభా. ఇక నేను వచ్చేవారం ఎలిమినేట్ అయినా పర్లేదు. నా వాల్యూస్ మాత్రం కాపాడుకునే వెళ్తాను అంటూ శోభాను నామినేట్ చేశాడు భోలే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట