Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ కోసం రంగంలోకి బ్రియన్ లారా.. ఆమెను సపోర్ట్ చేయాలంటూ అభ్యర్థన
Neha Chowdary- Brian Lara: బిగ్‌బాస్ సీజన్ ఆరో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కంటెస్టెంట్లు కూడా పోటీపోటీగా టాస్క్‌ల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తమ ఆటతీరుతో అభిమానులు, ప్రేక్షకుల ఓట్లను సంపాదించుకునేందుకు తెగ కష్టపడుతున్నారు.
Neha Chowdary- Brian Lara: బిగ్‌బాస్ సీజన్ ఆరో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కంటెస్టెంట్లు కూడా పోటీపోటీగా టాస్క్‌ల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తమ ఆటతీరుతో అభిమానులు, ప్రేక్షకుల ఓట్లను సంపాదించుకునేందుకు తెగ కష్టపడుతున్నారు. ఇవి బుల్లితెర ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి. కాగా ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకోనుందీ రియాలిటీ షో. మొదటి వారం ఎలిమినేషన్ లేనప్పటికీ.. రెండో వారం ఏకంగా ఇద్దరిని హౌస్ నుంచి బయటకు పంపించి బిగ్‌షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం నామినేషన్లలో మొత్తం 9 మంది బరిలో నిలిచారు. వాసంతీ కృష్ణన్, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి, నేహా చౌదరి,ఇనయా సుల్తానా, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్ లో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు.
ఇదిలా ఉండగా.. నామినేషన్ జాబితాలో ఉన్న వాళ్లను సపోర్ట్ చేస్తూ కొందరు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు క్యాంపెయిన్ షురూ చేశారు. ఇనయా సుల్తానాకు మద్దుతనివ్వాలని ప్రముఖ దర్శకుడు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించిన సంగతి తెలిసిందే. తాజాగా నామినేషన్ లిస్ట్ లో ఉన్న నేహా చౌదరిని కాపాడేందుకు ఏకంగా విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా బరిలోకి దిగారు. సోషల్ మీడియా వేదికగా నేహాకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కాగా బ్రియన్ లారా లాంటి లెజెండరీ నేహా చౌదరికి మద్దతు ఇవ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా? వీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడిందని సందేహిస్తున్నారా? వివరాల్లోకి వెళితే.. నేహా చౌదరి టీవీ యాంకర్ గా, స్పోర్ట్స్ ప్రజంటర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్‌లు, టీమిండియా క్రికెట్ మ్యాచ్‌లకు తెలుగు కామెంట్రీ చేసే వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు. ఈనేపథ్యంలోనే లారాతో నేహాకి పరిచయం ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఆమెని సపోర్ట్ చేయడానికి లారా ముందుకొచ్చారు. మరి కరేబియన్ క్రికెటర్ సపోర్ట్ నేహాను ఏ మేరకు కాపాడుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..