AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ చరిత్రలోనే మొదటిసారి.. వారిద్దరికి షాకిచ్చిన నాగార్జున..

ఇక ఆ తర్వాత బాలాదిత్య ఆట తీరు.. ప్రవర్తన గురించి సీరియస్ అయ్యారు నాగ్. ముఖ్యంగా వీడియో చూపించి మరీ టార్గె్ట్ చేశారు.

Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ చరిత్రలోనే మొదటిసారి.. వారిద్దరికి షాకిచ్చిన నాగార్జున..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Sep 25, 2022 | 8:30 AM

Share

బిగ్ బాస్ గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ పై ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. ఇక వారం వారం తగ్గిపోతున్న బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ చూస్తే ఈ సీజన్ అట్టర్ ప్లాప్ అనేది అర్థమవుతుంది (Bigg Boss 6 Telugu). ఆట ఆడకుండా ఎంజాయ్ చేస్తున్న కంటెస్టెంట్లకు ప్రత్యేకంగా నాగార్జున క్లాస్ తీసుకుంటున్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రావడం లేదనే చెప్పుకొవాలి. ఇక ఈవారం సైతం మరోసారి గేమ్ పై ఫోకస్ చేయనివారికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు హోస్ట్ నాగార్జున. అయితే ఈసారి ఆట తగ్గించిన మరికొందరిని కూడా అదే బ్యాచ్‏లో కలిపేశారు. ఆట ఇంకా మొదలు పెట్టలేదని గత వారం తొమ్మిది మందిని సోఫా వెనక నిల్చోబెట్టిన సంగతి తెలిసిందే. అందులో అభినయ శ్రీ, షాని ఎలిమినేట్ కాగా.. ఈవారం మిగిలిన ఏడుగురిని సోఫా వెనక నిల్చోబెట్టారు. వారిలో శ్రీహాన్, శ్రీసత్య ఇద్దరు ఈవారం చాలా బాగా ఆట ఆడారని వారిద్దని ప్రశంసించి సోఫాలో కూర్చోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత బాలాదిత్య ఆట తీరు.. ప్రవర్తన గురించి సీరియస్ అయ్యారు నాగ్. ముఖ్యంగా వీడియో చూపించి మరీ టార్గె్ట్ చేశారు.

ఆ తర్వాత వాసంతి, కీర్తి భట్, మెరీనా రోహిత్, సుదీప ఆట తీరు..ప్రవర్తన బాలేదంటూ చెప్పుకొచ్చారు. వీళ్లు మాత్రమే కాకుండా.. చంటి, రాజ్, అర్జున్ కళ్యాణ్ ఈవారం సరిగ్గా ఆట ఆడలేదని వారిద్దరి కూడా సోఫా వెనకాల నిల్చోబెట్టారు. అనంతరం.. ఇనయ, శ్రీహాన్ మధ్య జరిగిన గొడవ.. రేవంత్ లాగిపెట్టి కొడతాను అనడం.. గీతూ దొబ్బెయ్ అంటూ మాట్లాడిన తీరుపై నాగ్ అసహనం వ్యక్తం చేశారు. ఆట తీరు బాగున్నా.. మాట్లాడే విధానం సరిగ్గా లేదని.. ఇకపై అలా మాట్లాడితే ఊరుకోనంటూ ఫైర్ అయ్యారు. అనంతరం.. సోఫా వెనక నిల్చున్న 8 మందిలో హోస్ట్ నాగార్జున మొదటి సారి నేరుగా నామినేట్ చేశారు. బిగ్ బాస్ చరిత్రలోనే హోస్ట్ నామినేట్ చేయడం తొలిసారి అంటూ చెబుతూ.. హౌస్ మేట్స్ ఓట్లతో ఇద్దరిని నామినేట్ చేశారు. అందులో అర్జున్ కళ్యాణ్, కీర్తికి ఎక్కువ ఓట్లు రాగా.. వీరిద్దరిని నేరుగా నామినేట్ చేశారు నాగార్జున.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!