Bigg Boss 6 Telugu: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. ఇనయ సేఫ్.. చివరకు ఎలిమినేట్ ఆమె అయ్యిందేంటీ..

మూడోవారం ఎలిమినేషన్ ట్విస్ట్ ఎక్కువగానే జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వారం ఇనయ ఎలిమినేట్ కాబోతుందంటూ వార్త లీక్ అయిన సంగతి తెలిసిందే. ముందు నుంచి వాసంతి ఎలిమినేట్ అవుతుందనుకున్నారు.

Bigg Boss 6 Telugu: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. ఇనయ సేఫ్.. చివరకు ఎలిమినేట్ ఆమె అయ్యిందేంటీ..
Inaya Sultana, Neha Chaudary, Arohi Rao, Vasanthi Krishnan
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 25, 2022 | 1:38 PM

బిగ్ బాస్.. ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టం. అంతేకాదు ప్రేక్షకుల అంచనాలకు.. బిగ్ బాస్ నిర్ణయానికి అసలు సంబంధమే ఉండదు. ముఖ్యంగా ఎలిమినేషన్ ట్విస్ట్ మాములుగా ఉండవు. గత సీజన్లలో సోషల్ మీడియాలో వచ్చిన ఓట్స్ కంటే.. మరొకరు బయటకు వచ్చేసిన సంఘటనలు అనేకం. ఇక ఇప్పుడు సీజన్ 6 రసవత్తరంగా సాగుతుంది. అయితే మొదటి రోజు నుంచి ఈ సీజన్ పై పెదవి విరుస్తున్నారు ఆడియన్స్. ఎందుకంటే గేమ్ ఆడేందుకు వచ్చినవారికంటే.. ఎంజాయ్ చేసేందుకు వచ్చిన వారే ఎక్కువ. హౌస్‏లో ఒకరిద్దరు తప్ప మిగతా బ్యాచ్ మొత్తం తిన్నామా.. కూర్చున్నామా.. అన్నట్టుగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఆట షూరు చేయనివారందరికీ గత వారం నాగార్జున క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం కూడా మరోసారి ఒక్కొక్కరిపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. మూడోవారం ఎలిమినేషన్ ట్విస్ట్ ఎక్కువగానే జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వారం ఇనయ ఎలిమినేట్ కాబోతుందంటూ వార్త లీక్ అయిన సంగతి తెలిసిందే. ముందు నుంచి వాసంతి ఎలిమినేట్ అవుతుందనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఇనయ ఎలిమినేట్ అయ్యిందనే న్యూస్ లీక్ అయ్యింది. ఇప్పటివరకు ఇంట్లో ఉన్న అందరి అమ్మాయిలలో నేహ, ఇనయ, గీతూ మాత్రమే మొదటి నుంచి గేమ్ ఆడుతున్నారు. అందులో మూడో వారం ఇనయ కెప్టెన్సీ టాస్కులో తీవ్ర పోరాటం చేసింది. ముఖ్యంగా శ్రీహన్, రేవంత్‏లతో జరిగిన మాటల యుద్ధంలో ఏమాత్రం తగ్గకుండా వాదించింది. అంతేకాకుండా ఫిజికల్ టాస్కులలోనూ అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా గట్టిపోటినిచ్చింది ఇనయ. దీంతో ఆమెకు ఓటింగ్ శాతం పెరిగిపోయింది. అయితే సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం ఇనయ సేఫ్ ప్లేస్‏లోనే ఉందని..ఇనయను ఎలా చేస్తారంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చివరి నిమిషంలో ఎలిమినేషన్‏లో ట్విస్ట్ ఇచ్చినట్లుగా సమాచారం. లేటేస్ట్ టాక్ ప్రకారం ఇనయ కాకుండా నేహ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు ఇనయ మాత్రమే గొడవలలో.. టాస్కులలో చాలా స్ట్రాంగ్‏గా ఉంటుంది. అనవసరంగా ఎమోషనల్ కాకుండా ఒంటరిగా పోరాడుతుంది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేస్తే ఇక బిగ్‏బాస్ హోస్‏లో అబ్బాయిలకు పోటీనిచ్చే అమ్మాయి కేవలం గీతూ మాత్రమే ఉంటుంది. అలాగే ఇనయ ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ చూసేవారి సంఖ్య మరింత దారుణంగా పడిపోవడం ఖాయమంటున్నారు. అందుకే ఇనయను కాకుండా నేహాను బయటకు పంపించినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.