ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందు ‘ఉయ్యాలా జంపాలా’ జోడి

ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు 'ఉయ్యాలా జంపాలా' జోడి. హిట్ పెయిర్‌గా టాలీవుడ్‌లో మంచి టాక్ తెచ్చుకున్నారు రాజ్ తరుణ్, అవికా గోర్‌లు. 'ఉయ్యాలా జంపాలా' వంటి క్యూట్ ప్రేమ కథతో...

  • Tv9 Telugu
  • Publish Date - 11:26 am, Tue, 28 April 20
ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందు 'ఉయ్యాలా జంపాలా' జోడి

ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు ‘ఉయ్యాలా జంపాలా’ జోడి. హిట్ పెయిర్‌గా టాలీవుడ్‌లో మంచి టాక్ తెచ్చుకున్నారు రాజ్ తరుణ్, అవికా గోర్‌లు. ‘ఉయ్యాలా జంపాలా’ వంటి క్యూట్ ప్రేమ కథతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమయ్యారు వీరిద్దరూ. తొలి చిత్రంతోనే హిట్‌ పెయిర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మరోసారి ‘సినిమా చూపిస్తా మామ’లోనూ కలిసి సందడి చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి.. ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. వీరి కాంబోలో ఓ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రాబోతుందట.

‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ ఫేమ్ డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి ఈ ఫన్నీ సినిమాకి దర్శకత్వం వహించనున్నారని టాక్. గతంలో ఈ జంట నటించిన రెండు చిత్రాలు విజయాలు సాధించడం వల్ల హ్యాట్రిక్ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. కాగా ఇప్పటికే రాజ్ తరుణ్ నటించిన ‘ఓరేయ్ బుజ్జిగా’ సినిమా కరోనా లాక్‌డౌన్ తర్వాత థియేటర్లోకి రానుంది.

Read More: 

మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్