AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Shirish: బుల్లితెరపైకి అల్లువారబ్బాయి.. మిల్కీబ్యూటీతో కలిసి సందడి చేయనున్న హీరో..

వెండితెరపై అలరించిన స్టార్ హీరోహీరోయిన్స్ ఇప్పుడు బుల్లితెరపై హంగామా చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కింగ్

Allu Shirish: బుల్లితెరపైకి అల్లువారబ్బాయి.. మిల్కీబ్యూటీతో కలిసి సందడి చేయనున్న హీరో..
Shirish
Rajitha Chanti
|

Updated on: Aug 11, 2021 | 6:40 PM

Share

వెండితెరపై అలరించిన స్టార్ హీరోహీరోయిన్స్ ఇప్పుడు బుల్లితెరపై హంగామా చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, నాని, ఎన్టీఆర్ వంటి స్టార్స్ బుల్లితెరపై సత్తా చాటగా.. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా కూడా టెలివిజన్‏పైకీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. హిందీలో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రామ్‏ను తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లోకి తీసుకువస్తున్నారు నిర్వహకులు. అయితే తెలుగు వెర్షన్‏కు తమన్నా హోస్ట్‏గా వ్యవహరించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట్లో హల్‏చల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ షూటింగ్ జరుగుతుంది.

అయితే మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్‏కు ఫస్ట్ సెలబ్రెటీ గెస్ట్‏గా అల్లు శిరీష్ హాజరయ్యారు. ఈ విషయాన్ని శిరీష్ తన ఇన్‏స్టా స్టోరీలో వెల్లడించారు. తమన్నాతో కలిసి మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్‏లో భాగం అయినందుకు చాలా ఎగ్జైటింగ్‏గా ఉంది.. ఇందులో ఫస్ట్ సెలబ్రెటీ గెస్ట్ అయినందకు సంతోషంగా ఉంది.. షూటింగ్ కూడా పూర్తిచేసామంటూ శిరీష్ తెలిపారు. త్వరలోనే ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది.

Allu Shirish

ఇదిలా ఉంటే.. తెలుగుకు తమన్నా హోస్ట్‏గా వ్యవహరిస్తుండగా.. తమిళ్ వెర్షన్‏కు స్టార్ హీరో విజయ్ సేతుపతి.. కన్నడలో కిచ్చ సుదీప్ హోస్ట్‏గా వ్యవహిరించబోతున్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. అటు హీరోయిన్‏గా పలు సినిమాల్లో నటిస్తున్న తమన్నా.. నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్ట్రో సినిమాలోక కీలక పాత్రలో నటిస్తుంది.

Also Read:  Paagal Pre Release Event: లవ్ యూ చెప్పడం వేరు.. లవ్ చేయడం వేరు అంటున్న ‘పాగల్’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

Mahesh Babu: సిద్ధ వైద్యాన్ని ప్రమోట్ చేస్తున్న హీరో మహేష్ బాబు.. ఏమన్నారంటే?

Raj Kundra Case: రాజ్ కుంద్రాకు బెయిల్ వద్దేవద్దు.. బెయిల్ ఇస్తే దేశం విడిచి ఎస్కేప్ కావొచ్చు!

Kavya Madhavan: తెరపైకి మరోసారి హీరోయిన్ భావన కిడ్నాప్ కేసు.. నటి కావ్య మాధవన్‏ను విచారిస్తున్న పోలీసులు..