Bigg Boss 5: కోవిడ్ థర్డ్ వేవ్ గండం.. బిగ్ బాస్ షోను హర్డిల్స్ లేకుండా నడిపేదెలా? ఆర్గనైజర్స్ సరికొత్త యోచన
Bigg Boss 5 Telugu: ఇంటర్నేషనల్ లెవల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇంత ప్రస్టీజియస్ షో లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.
Bigg Boss 5 Telugu: ఇంటర్నేషనల్ లెవల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇంత ప్రస్టీజియస్ షో లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తెలుగు సీజన్ 4ను ఎఫెక్ట్ చేయకపోయినా.. అదర్ లాంగ్వేజెస్‌లో మాత్రం కోవిడ్ కారణంగా బిగ్ బాస్ కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. గతంలో ఎప్పుడు ఫేస్ చేయని హర్డిల్స్ ఎదురుకావటంతో ఆర్గనైజర్స్ కూడా ఆలోచనలో పడ్డారు. కోవిడ్ కారణంగా ఈసారి బిగ్ బాస్ థీమ్‌తో పాటు టాస్క్‌ల ప్యాట్రన్ కూడా మార్చే ఆలోచనలో ఆర్గనైజర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కోవిడ్ థర్డ్ వేవ్ గండ నేపథ్యంలో బిగ్ బాస్ షోకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా పక్కా ప్లాన్స్ చేసుకుంటున్నారట ఆర్గనైజర్స్.
గత సీజన్‌లో పలు భాషల్లో రకరకాల సమస్యలను ఫేస్ చేసింది బిగ్ బాస్ టీమ్. కన్నడ బిగ్‌బాస్ షోకు అనుమతులను తాత్కాలికంగా రద్దు చేయటంతో షో పూర్తి కాకముందే కంటెస్టెంట్‌లను బయటకు పంపేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. అలా వెళ్లిపోయిన హౌస్‌మెట్స్‌ను కొద్ది రోజుల తరువాత వెనక్కి పిలిచి మళ్లీ షో కంటిన్యూ చేశారు.
మలయాళ బిగ్ బాస్ అయితే మరో వింత బాధ… తమిళనాడులో సెట్ వేయటంతో వరదల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల నుంచి తేరుకొని కాస్త సెటిల్ అయ్యే సమయానికి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని… హౌస్‌లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించటం లేదని సెట్‌ను సీజ్ చేశారు. ఇలా షోనూ అర్ధాంతరంగా క్యాన్సిల్ చేయటం బిగ్ బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్.
ఈ నేపథ్యంలో ఈ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 5కి బిగ్ చేంజెస్ ప్లాన్ చేస్తున్నారు. బయటి వారితో ఎక్కువగా సంబంధం లేని టాస్కులే హౌస్‌మెట్స్‌కు ఇచ్చేలా కొత్త షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారట. అదే సమయంలో కోవిడ్ ప్రోటోకాల్స్ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని భాషల్లోనూ ఇంప్లిమెంట్ చేయాలన్నది నేషనల్ టీమ్ ప్లాన్. మరి ఈ జాగ్రత్తలతో ఈ సారైనా బిగ్ బాస్ అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతుందేమో చూడాలి.
(సతీష్, ET డెస్క్, టీవీ9 తెలుగు)
Also Read..
Allu Arjun: పిల్లాడిగా మారిన ఐకాన్ స్టార్.. క్యూటీ అర్హతో ఆటలు.. నెట్టింట వీడియో వైరల్..
Singer Sunitha: నా ఎనర్జీ సీక్రెట్ అదే.. సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు