AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Sunitha: నా ఎనర్జీ సీక్రెట్ అదే.. సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పటికీ తన మధురమైన గానంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది సింగర్ సునీత. కేవలం గాయనిగా మాత్రమే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా సునీత గుర్తింపు పొందింది.

Singer Sunitha: నా ఎనర్జీ సీక్రెట్ అదే.. సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు
Singer Sunitha
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2021 | 1:05 PM

Share

ఇప్పటికీ తన మధురమైన గానంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది సింగర్ సునీత. కేవలం గాయనిగా మాత్రమే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా సునీత గుర్తింపు పొందింది. సంప్రదాయపు చీరకట్టులో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్న సునీతకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇటీవల మ్యాంగో అధినేత రామ్‏ను రెండో వివాహం చేసుకున్నసంగతి తెలిసిందే. వివాహం అనంతరం సునీత సోషల్ మీడియాలో  యాక్టివ్‏గా  ఉంటూ..  తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల తన జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాల గురించి ప్రస్తావించిన ఆమె.. తాజాగా.. తన ఎనర్జీకి గల సిక్రెట్ గురించి చెప్పేశారు.  ఇటీవల కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో లైవ్ చాట్స్ నిర్వహిస్తూ.. నెటిజన్లు అడిగిన పాటలను ఆలపిస్తూ వచ్చారు. తన వ్యక్తిగత విషయాలను, వృతిపరమైన విషయాలను నెట్టింట్లో షేర్ చేసుకుంటూ..లైవ్ చాట్స్ ద్వారా అభిమానులకు టచ్‏లో ఉంటూ వస్తున్నారు సునీత. తాజాగా ఇన్‏స్టా వేదికగా.. తన ఎనర్జీకి కారణం పాడటం మాత్రమే అంటూ సిక్రెట్ రివీల్ చేశారు.

ట్వీట్..

ఇదిలా ఉంటే.. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత తన జీవితంలో తగిలిన దెబ్బల కారణంగా మనుషులను పూర్తిగా నమ్మడం మానేశానని చెప్పుకొచ్చారు. మొదటి పెళ్లి తర్వాత ఎన్నో విషయాలు తెలిసోచ్చాయని.. ఇక ఆ వివాహం బ్రేకప్ అయిన తర్వాత సుమారు 15ఏళ్ల పాటు ఎన్నో కష్టాలను అనుభవించానని చెప్పుకొచ్చారు. తనకు పెళ్లి విషయంలో రామ్ నిజాయితీగా అనిపించారని.. కానీ పెళ్లి తర్వాత కొందరు చేసిన కామెంట్స్ బాధ కలిగించాయని చెప్పారు.

ట్వీట్..

Also Read:  Pelli SandaD: ‘పెళ్లి సందD’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్.. చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం.. ఫిదా కావాల్సిందే..

Lavanya tripati: షాకింగ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. వస్తువులను చూస్తే భయపడతానంటున్న లావణ్య త్రిపాఠి..

R. Narayanamurthy: సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం.. రైతుబంధుపై ఆర్. నారాయణ మూర్తి వ్యాఖ్యలు..