Kasturi: మూడేళ్లు ప్రాణం కోసం పోరాటం.. ఆ సమయంలో ఎన్నో నేర్చుకున్నాను.. నటి కస్తూరి ఎమోషనల్ కామెంట్స్..

తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‏గా నటించి గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి శంకర్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

Kasturi: మూడేళ్లు ప్రాణం కోసం పోరాటం.. ఆ సమయంలో ఎన్నో నేర్చుకున్నాను.. నటి కస్తూరి ఎమోషనల్ కామెంట్స్..
Kasturi
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 11, 2021 | 3:39 PM

తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‏గా నటించి గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి శంకర్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బుల్లితెరపై గృహలక్ష్మి సీరియల్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల సీరియల్ ద్వారా మాత్రమే కాకుండా.. సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచింది కస్తూరి. తాజాగా ఓ రియాల్టీ షోలో పాల్గోన్న కస్తూరి తన కూతురి ఆరోగ్య పరిస్థితి.. తన జీవితంలో ఎదురైన చెదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టుకుంది.

షో ప్రారంభం నుంచి ఎంతో సరదాగా ఉన్న కస్తూరి తన కూతురి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. మూడు సంవత్సరాల పాటు నా కూతురు క్యాన్సర్‏తో పోరాటం చేస్తున్న సమయంలో నేను పక్కనే ఉన్నాను. చిన్న బాబును ఇంట్లో వదిలేసి ఆసుపత్రిలో మూడు సంవత్సరాలు నా కూతురి ప్రాణం కోసం పోరాటం చేశాను. తన కోసం యముడు ఒక వైపు నేను ఒక వైపు యముడు అన్నట్లుగా పోరాటం చేశాను అంటూ కన్నీరు పెట్టుకుంది. చికిత్స సమయంలో డాక్టర్స్ ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‏ను తను తట్టుకోలేదేమో అని బాధ వేసింది. అలా క్యాన్సర్‏ను జయించిన నా కూతురు నాకు హీరో అంటూ కస్తూరి ఎమోషనల్ అయ్యారు. ఇక కూతురు ఆసుపత్రిలో ఉన్న సమయంలో తను చాలా నేర్చుకున్నానని.. ఆస్తులు తనకు అవసరం లేదని.. తన కూతురు లాగే లుకేమియాతో బాధపడుతున్నారంటే.. తాను పెట్టిన ట్రస్ట్ ద్వారా కావాల్సిన సాయం అందిస్తానని చెప్పుకొచ్చింది.

Also Read: Nayanatara: రింగ్ చూపిస్తూ అసలు విషయం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. రూమర్స్‏కు చెక్ పెట్టినట్టేనా ?

Priyanka Jawalkar: ఇదే చేయాలని అనుకోను.. నాకు నచ్చిన పాత్ర ఏదైనా చేస్తాను..

Bellamkonda Sreenivas: కొత్త మూవీని అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ‘స్టూవర్ట్‌‌‌పురం దొంగ’గా బెల్లంకొండ శ్రీనివాస్..

Viral Video: స్టన్నింగ్‌ స్టంట్‌ చేద్దాం అనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..