Priyanka Jawalkar: ఇదే చేయాలని అనుకోను.. నాకు నచ్చిన పాత్ర ఏదైనా చేస్తాను..

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఇటీవల స్పీడ్ పెంచిన ఈ బ్యూటీ  తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో...

Priyanka Jawalkar: ఇదే చేయాలని అనుకోను.. నాకు నచ్చిన పాత్ర ఏదైనా చేస్తాను..
Priyanka Jawalkar
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 11, 2021 | 1:59 PM

Priyanka Jawalkar: టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్‌‌‌‌‌లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఇటీవల స్పీడ్ పెంచిన ఈ బ్యూటీ  తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక అందం, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ… ‘ థియేటర్‌కి ప్రేక్షకులు వస్తారా రారా.. అనే ఒక డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు థియేటర్స్ కు ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్స్ కి వస్తున్నారు. తిమ్మరుసు విడుదల తరువాత గ్లామర్ పై కొంత కేర్ తీసుకొని వెయిట్‌‌‌‌లాస్ అయ్యాను. నేనే వంట చేసుకోవడం ప్రారంభించా… అని చెప్పుకొచ్చింది. అలాగే టాక్సీవాలా సినిమా తరువాత సెలెక్టెడ్‌‌‌గా స్క్రిప్ట్స్ ఎంచుకొని మూవీస్ సైన్ చేశాను. గమనం సినిమాలో నా రోల్ చిన్నదే అయిన బాగా నచ్చి ఒప్పుకున్నాను.  నేను నటించిన సినిమాలకు నా ఫ్రెండ్స్ పెద్ద క్రిటిక్స్. వాళ్ళు నేను ఎక్కడ బాగా చేశాను ఎక్కడ మిస్ అయ్యాను వాళ్ళు చెబుతుంటారు. డైరెక్టర్ చెప్పినట్లు చెయ్యడమే నా లక్ష్యం, వారి వల్లే నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. బయట నామీద వచ్చేనెగిటీవ్‌‌‌‌‌ను లైట్ తీసుకుంటాను, పాజిటివ్‌‌‌ను మాత్రమే ఎంజాయ్ చేస్తాను. ఇప్పటిదాకా మంచి సినిమాల్లో నటించాను భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని ఉంది. ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలో సాంగ్స్‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నా డాన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని డాన్స్ నేర్చుకుంటున్నాను అని తెలిపింది ఈ బ్యూటీ. అలాగే ‘తెలుగులో కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను త్వరలో ఫైనల్ చేస్తాను. ఓటిటి ఆఫర్స్ కూడా వస్తున్నాయి, స్టోరీస్ విన్నాను, కొన్ని ఆడిషన్స్ జరుగుతున్నాయి అని అంది. ఇలాంటి పాత్రలే చెయ్యాలని లేదు, నాకు నచ్చిన పాత్ర ఏదైనా చేస్తాను. తమిళ్‌‌‌‌లో ఒక సినిమా సైన్ చేశాను. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా అని చెప్పుకొచ్చింది ఈ తెలుగు ముద్దుగుమ్మ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన స్టార్ హీరో.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ…

Sandeep Reddy Vanga: మహేష్‌‌‌‌‌‌తో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. ఫ్యాన్స్‌‌‌కు పూనకాలే

F3 : ‘ఎఫ్‌ 3’ హంగామా..! రేచీకటితో వెంకటేశ్‌, నత్తితో వరుణ్‌ తేజ్‌.. ఇక నవ్వులే నవ్వులు