Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన స్టార్ హీరో.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ…

సినిమాలో ట్విస్ట్‌లాగే.. తమిళ్ హీరో ఆర్యలో మరో యాంగిల్‌ వెలుగులోకి వచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని..

క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన స్టార్ హీరో.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ...
Arya
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 11, 2021 | 11:07 AM

Arya : సినిమాలో ట్విస్ట్‌లాగే.. తమిళ్ హీరో ఆర్యలో మరో యాంగిల్‌ వెలుగులోకి వచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆర్యపై ఫిర్యాదు చేసింది శ్రీలంకకు చెందిన యువతి. ఆమెదగ్గర నుంచి భారీ మొత్తంలో నగదు కూడా తీసుకున్నాడని ఆరోపించింది. శ్రీలంక యువతి ఆరోపణలు.. కొలీవుడ్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఆర్యకి ఇంతకుముందే హీరోయిన్ సయాషా సైగల్‌‌‌తో వివాహమైంది. ఇద్దరు అన్యోన్యంగానే ఉంటున్నారు. ఇటీవలే ఈ జంటకు ఓ పాపకూడా జన్మించింది. ఈ క్రమంలో ఎంట్రీ ఇచ్చింది శ్రీలంకకు చెందిన యువతి. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఆర్య మోసం చేశాడని ఆమె ఆరోపిస్తుంది. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. హాజరు కావాలని ఆర్యకు సూచించారు. దీంతో చెన్నై కమిషనర్ ఆఫీస్‌లో ఉదయం విచారణకు హాజరయ్యాడు ఆర్య. నిజంగానే ఆర్య శ్రీలంక యువతిని మోసం చేశాడా..? పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు తీసుకున్నాడు..?అసలు పోలీసుల విచారణలో ఆర్య ఏం చెప్పాడన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక ఆర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. అలాగే రాజా రాణి, నేనే అంబానీ, వాడు వీడు లాంటి సినిమాలతో  ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం విశాల్ తో కలిసి ఎనిమీ అనే సినిమా చేస్తున్నాడు ఆర్య.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anikha Surendran: టాలీవుడ్‏లోకి మరో మలయాళీ ముద్దుగుమ్మ.. క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు..

RK Selvamani: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. హీరో శింబుపై తీవ్ర ఆరోపణలు చేసిన రోజా భర్త సెల్వమణి..

Meera Mithun: బిగ్‏బాస్ బ్యూటీపై మండిపడుతున్న నెటిజన్లు… 7 సెక్షన్ల కింద కేసు నమోదు.. ఇంతకీ ఏం చేసిందంటే..