Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RK Selvamani: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. హీరో శింబుపై తీవ్ర ఆరోపణలు చేసిన రోజా భర్త సెల్వమణి..

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళ్‏లో శింబు చేసిన సినిమాలు చాలా వరకు తెలుగులో

RK Selvamani: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. హీరో శింబుపై తీవ్ర ఆరోపణలు చేసిన రోజా భర్త సెల్వమణి..
Rk Selvamani
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 09, 2021 | 2:57 PM

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళ్‏లో శింబు చేసిన సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. అయితే గత కొంతకాలంగా శింబు కెరీర్‏లో సరైన హిట్టు పడడం లేదు. అటు టాప్ హీరోగా ఉన్న శింబుకు అదే రేంజ్‏లో వివాదాలు కూడా ఉన్నాయి. సినిమా షూటింగ్స్ సమయంలో శింబు సమయానికి రాడు అని.. దర్శకులకు సైతం సరిగ్గా సహకరించడని గతంలో ఆరోపణలు ఉన్నాయి. దీంతో శింబుతో చిత్రాలను తెరకెక్కించేందుకు ఎవరు ముందుకు రాలేదు. చాలా కాలం తర్వాత డైరెక్టర్ సుచీంద్రన్.. శింబు ప్రధాన పాత్రలో ఈశ్వరన్ సినిమా తెరకెక్కించాడు. తాజాగా శింబు పై నటి రోజా భర్త ఆర్క సెల్వమణి తీవ్ర ఆరోపణలు చేశారు. తమిళ నిర్మాతల మండలికి, ఫెప్సీకి మధ్య తలెత్తిన సమస్యకు శింబునే కారణమన్నారు. అందుకే శింబు నటిస్తున్న నాలుగు సినిమాలకు నిర్మాతల మండలి విజ్ఞప్తి మేరకు ఎలాంటి సహకారం అందించలేమన్నారు.

ఎన్నో దశాబ్ధాలుగా కలిసి పనిచేసిన ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI)తో సంబంధాలు తెంచుకుంటున్నట్లుగా తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటించింది. తమ చిత్రాలకు కావాల్సిన కార్మికుల కోసం వేరే ఎవరినైనా నియమించుకోవాలని సూచించింది. దీనిపై ఆర్కె సెల్వమణి మాట్లాడుతూ.. శింబు వలనే ఫెఫ్సీకి, నిర్మాతల మండలికి వివాదం ఏర్పడిందని.. అంతకుముందు నిర్మాతల మండలి అనుమతితోనే ఫెఫ్సీ కార్మికులు శింబు సినిమాకు పనిచేశారని చెప్పారు. శింబు హీరోగా ఐసరి గణేశ్ నిర్మిస్తున్న సినిమా ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరగుతున్న నేపథ్యంలో నాలుగు రోజులు అనుమతి ఇవ్వాలని కోరారని.. నిర్మాతల మండలి అనుమతితోనే దానికి పనిచేశారని చెప్పారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్‏తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

ఇదిలా ఉంటే.. శింబు హీరోగా నటించిన అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్ సినిమా వలన నిర్మాత మైఖేల్ రాయప్పన్‏కు ఆర్థకంగా నష్టం ఏర్పడింది. దీంతో శింబు తీరు వల్లే తాను నష్టపోయాయని.. తనకు నష్ట పరిహారం ఇప్పించాలని నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు రాయప్పన్. ఫిర్యాదు పై స్పందించిన నిర్మాతల మండలి శింబు నష్టపరిహారం చెల్లించాలని.. లేదంటే ఆయన నటిస్తున్న సినిమాలకు ఎలాంటి సహకారం అందించమని ప్రకటించారు. అయితే ఇటీవల శింబు సినిమాలకు ఫెఫ్సీ కార్మికులు పనిచేయడంతో నిర్మాతల మండలి, ఫెఫ్సీకి మధ్య విభేదాలు మొదలయ్యాయి..

Also Read: Meera Mithun: బిగ్‏బాస్ బ్యూటీపై మండిపడుతున్న నెటిజన్లు… 7 సెక్షన్ల కింద కేసు నమోదు.. ఇంతకీ ఏం చేసిందంటే..

Mahesh New Look: ఇదేంటి బాబు ఏజ్‌ పెరుగుతుందా.. తగ్గుతుందా.? నాలుగు పదుల వయసులోనూ నవ యువకుడిలా..

Ravi Teja: బయోపిక్‌‌‌‌లో నటించనున్న మాస్‌‌‌‌రాజా.. గజదొంగ టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఫిక్స్ అయినట్టేనా..?