Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meera Mithun: బిగ్‏బాస్ బ్యూటీపై మండిపడుతున్న నెటిజన్లు… 7 సెక్షన్ల కింద కేసు నమోదు.. ఇంతకీ ఏం చేసిందంటే..

బిగ్‏బాస్ తమిళ సీజన్ 3 కంటెస్టెంట్ మీరా మిథున్ పై చెన్నై పోలీస్ స్టేషన్‏లో కేసు నమోదైంది. తమ సామాజిక వర్గం వారిని అలాగే

Meera Mithun: బిగ్‏బాస్ బ్యూటీపై మండిపడుతున్న నెటిజన్లు... 7 సెక్షన్ల కింద కేసు నమోదు.. ఇంతకీ ఏం చేసిందంటే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 09, 2021 | 2:27 PM

బిగ్‏బాస్ తమిళ సీజన్ 3 కంటెస్టెంట్ మీరా మిథున్ పై చెన్నై పోలీస్ స్టేషన్‏లో కేసు నమోదైంది. తమ సామాజిక వర్గం వారిని అలాగే సామాజిక సేవ చేసే కార్యకర్తలపై మీరా మిథున్ అనుచిత వ్యాఖ్యలు చేసింది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నాయకులు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికైనా మీరా పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందే అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరా షెడ్యూల్డ్ కుల చిత్ర కార్మికులందరినీ ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించాలని మీరా మిథున్ అన్నారు. ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు చట్ట విరుద్ధమైన కార్యకలపాలు, నేరాలకు పాల్పడటం వలన ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణం లేకుండా ఎవరు కూడా ఒకరి గురించి చెడుగా మాట్లాడరు అంటూ చెప్పుకొచ్చింది. చిత్రపరిశ్రమలోని షెడ్యూల్డ్ కులాల వారందరినీ, పరిశ్రమలోని డైరెక్టర్లను బయటకు పంపించే సమయం వచ్చిందనుకుంటున్నాను అని అన్నారు. గతంలో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన దర్శకుడు.. తన సినిమా ఫస్ట్‏లుక్ కోసం తన సినిమా కోసం ఉపయోగించుకున్నాడని మీరా ఆరోపించింది.

మీరా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో పలు కుల సంఘాల నేతలు.. తమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ అభిమాన హీరోహీరోయిన్స్‏ను అవమానించేలా మాట్లాడిందని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఆమెపై ఇప్పటికే 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని.. సైబర్ క్రైమ్ డిపార్ట్‏మెంట్ ఆధ్వర్యంలో ఈ కేసులు విచారణ జరుగుతున్నాయని తెలిపారు.

Also Read: Mahesh New Look: ఇదేంటి బాబు ఏజ్‌ పెరుగుతుందా.. తగ్గుతుందా.? నాలుగు పదుల వయసులోనూ నవ యువకుడిలా..

Ravi Teja: బయోపిక్‌‌‌‌లో నటించనున్న మాస్‌‌‌‌రాజా.. గజదొంగ టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఫిక్స్ అయినట్టేనా..?

Prabhas – Nag Ashwin Movie: త్వరలోనే ప్రాజెక్ట్ కే సెకండ్ షెడ్యూల్.. కీలక సన్నివేశాలన్నీ ఇందులోనేనట..