F3 : ‘ఎఫ్‌ 3’ హంగామా..! రేచీకటితో వెంకటేశ్‌, నత్తితో వరుణ్‌ తేజ్‌.. ఇక నవ్వులే నవ్వులు

F3 Movie : రెండేళ్ల క్రితం సంక్రాంతికి విడుదలైన ఎఫ్‌ 2 సినిమా ఎంత హంగామా సృష్టించిందో అందరికి తెలిసిందే. కరోనా టైంలో కూడా అందరికి నవ్వులు పంచింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ

F3 : 'ఎఫ్‌ 3' హంగామా..! రేచీకటితో వెంకటేశ్‌, నత్తితో వరుణ్‌ తేజ్‌.. ఇక నవ్వులే నవ్వులు
F3 Movie
Follow us
uppula Raju

|

Updated on: Aug 11, 2021 | 1:01 PM

F3 Movie : రెండేళ్ల క్రితం సంక్రాంతికి విడుదలైన ఎఫ్‌ 2 సినిమా ఎంత హంగామా సృష్టించిందో అందరికి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో దీనికి సీక్వెల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్ 3 గా రాబోతున్న ఈ చిత్రం మరింత నవ్వులు పంచనుంది. హీరోలు వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ ఫన్, ఫ్రస్ట్రేషన్‌ తో నవ్వులు పూయించేందుకు రెడీ అవుతున్నారు. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ కోసం 70కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు అంచనా.

కాగా ఎఫ్ 2 మాదిరే ఎఫ్ 3లో కూడా వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్‌ నటిస్తుంది. కాగా ఈ చిత్రంలో రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో వరుణ్‌ నటిస్తున్నాడని తెలిసింది. వరుణ్‌ అయితే నత్తి నత్తిగా మాట్లాడుతూ ఓ రేంజ్‌లో నటిస్తున్నాడట. దీన్ని బట్టి వెండితెరపై వెంకీ, వరుణ్‌ల ఫన్‌ ‘ఎఫ్‌ 2’ను మించి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్, మురళీ శర్మ, అంజలి కీలక పాత్రలో నటిస్తు‍న్నారు. సెకండాఫ్‌లో మురళీ శర్మ హంగామా మామూలుగా ఉండదట. వచ్చే సంక్రాంతికి ‘ఎఫ్‌ 3’ రిలీజ్‌ కానుంది.

ఇందులో హీరోలైన వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు రూ.12కోట్ల చొప్పున ముట్టనుందని.. అలాగే తమన్నాకు 1.5కోట్లు, మెహ్రీన్‌కి 70లక్షలు, అనిల్‌ రావిపూడికి 9 కోట్లు, దేవీ శ్రీ ప్రసాద్‌కి 2 కోట్లు ఇవ్వనున్నారని సమాచారం. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్‌ 2 పెద్ద విజయం సాధించడంతో పాటు దిల్‌ రాజుకు మంచి లాభాలను తీసుకొచ్చింది. అలాగే జాతీయ స్థాయి అవార్డు కూడా దక్కించుకుంది. దాంతో పాటు నటీనటులు కూడా బాగానే డిమాండ్ చేసినట్లు టాక్‌.

Viral Video : రెండు పులులు ఎదురుపడితే ఎలా ఉంటుందో తెలుసా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

వావ్ ! దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై మహిళ…ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ యాడ్ వీడియో వైరల్

Viral Video: ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుండేది.. రాంగ్ రూటులో వచ్చి కాళ్లు విరొగ్గొట్టుకున్న మహిళలు.. షాకింగ్ వీడియో..

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం