AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్ ! దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై మహిళ…ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ యాడ్ వీడియో వైరల్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే అతి పెద్దదైన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఎవరూ ఊహించని.. అద్భుతమైన యాడ్ ని రూపొందించింది. దుబాయ్ లోని అతి ఎత్తయిన బుర్జ్ ఖలీఫాపై మహిళ నిలబడి తమ సంస్థ ప్రమోషన్ కి సహకరిస్తున్న యాడ్ ఇది !

వావ్ ! దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై మహిళ...ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ యాడ్ వీడియో వైరల్
Woman Stands On Top Of Burj Khalifa
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 10, 2021 | 12:29 PM

Share

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే అతి పెద్దదైన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఎవరూ ఊహించని.. అద్భుతమైన యాడ్ ని రూపొందించింది. దుబాయ్ లోని అతి ఎత్తయిన బుర్జ్ ఖలీఫాపై మహిళ నిలబడి తమ సంస్థ ప్రమోషన్ కి సహకరిస్తున్న యాడ్ ఇది ! 30 సెకండ్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెషనల్ స్కై డైవింగ్ ఇన్స్ట్రక్టర్ అయిన నికోల్ స్మిత్ లుడ్ విక్ ఈ యాడ్ లో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ క్రూ మెంబర్ గా అదే యూనిఫామ్ తో కనిపిచింది. ఫ్లై ఎమిరేట్స్, ఫ్లై బెటర్ అని రాసి ఉన్న మెసేజ్ బోర్డులు పట్టుకుని చిరునవ్వుతో కనిపించిన ఈమె అచ్ఛు విమాన సిబ్బందిలో ఒకరనే అభిప్రాయానికి తావిచ్చింది. భూమినుంచి 828 మీటర్ల ఎత్తయిన బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తయిన కట్టడంగా పాపులర్ అయింది. తాను చేసిన స్టంట్లలో ఇది అద్భుతమైనదని నికోల్ తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది.

ఇప్పటివరకు ఇలాంటి సాహసాన్ని చేయలేదని ఆమె తెలిపింది. మీ క్రియేటివిటీ మార్కెటింగ్ ఐడియాకు నా జోహార్లు అని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ని ఆమె ప్రశంసించింది. ఈ బృందంలో తాను కూడా భాగస్వామినైనందుకు ఎంతో సంతోషిస్తున్నానని ఆమె వెల్లడించింది. బహుశా ఈ విధమైన ఐడియా మరే వైమానిక సంస్థకూ వచ్చి ఉండదని భావిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ని, ఈ మహిళను కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : Taliban Live Video: తాలిబన్లు ఘాతుకం.. బిగుతుగా డ్రెస్ వేసుకుందని మహిళ హతం..

 ‘మా‘ పాలిటిక్స్‌కు ‘మెగా’ టచ్..!ప్రస్తుత పరిణామాలపై చిరు సీరియస్..క్రిష్ణంరాజుకు లేఖ..:MAA Elections Controversy Live Video.

 వంటలక్క ఇంట బర్త్‌డే హంగామా..!సందడి చేసిన డాక్టర్ బాబు..ఇంతకీ బర్త్ డే ఎవరిదో తెలుసా..:Karthikadeepam vantalakka Video.

 బైక్‌ షోరూమ్‌లో స్మార్ట్‌ దొంగలు.. వీళ్ల తెలివికి ఆస్కార్‌ ఇచ్చినా తక్కువే.!షాక్ లో ఓనర్స్..:Smart thieves in bike showroom Video.