Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Psyche Asteroid: అంతరిక్షంలో రూ.72 కోట్ల కోట్లు ఖరీదు చేసే రాయి.. భూమిమీద తీసుకుని రావడానికి ప్రయత్నాలు

Psyche Asteroid: సృష్టిలో వింతలు, విశేషాలు.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. అంబరాన్ని అందుకున్నాడు. అంతరిక్షంలోని నక్షత్రాల గమనాలను, సముద్ర లోతులను కొలుస్తున్నాడు. ఆ సాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. తన తెలివితేటలతో..

Psyche Asteroid: అంతరిక్షంలో రూ.72 కోట్ల కోట్లు ఖరీదు చేసే రాయి.. భూమిమీద తీసుకుని రావడానికి ప్రయత్నాలు
Psyche Asteroid
Follow us
Surya Kala

|

Updated on: Aug 10, 2021 | 10:24 AM

Psyche Asteroid: సృష్టిలో వింతలు, విశేషాలు.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. అంబరాన్ని అందుకున్నాడు. అంతరిక్షంలోని నక్షత్రాల గమనాలను, సముద్ర లోతులను కొలుస్తున్నాడు. ఆ సాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. తన తెలివితేటలతో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. అత్యంత విలువైనవాటిని దక్కించుకోవడానికి ఆరాటపడుతూ అన్వేషణ సాగిస్తున్నాడు. తాజాగా అంబరంలో ఓ రాతిబండ కోట్ల విలువ చేస్తుందని గుర్తించిన మనిషి.. భూమి మీదకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

అనంత విశ్వంలో తేలుతున్న సైకీ అనేగ్రహశకలం విలువ ఏకంగా రూ. 72.లక్షల కోట్ల కోట్ల విలువైనదని సైంటిస్టుల పరిశోధనలో తెలిసింది. దీంతో ఆ సైకీని తవ్వి భూమి మీదకు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి ఇంతటి విలువైన సైకీ స్పెషాలిటీ ఏమిటంటే..

సౌరకుటుంబంలో సూర్యుడు చుట్టూ.. ఇతర గ్రహాల తరహాలతో పాటు.. కొన్ని లక్షల గ్రహ శకాలాలు తిరుగుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి సైకీ.. ఇది అంగారక, గురుగ్రహాల మధ్యలో ఉంది. ఈ ఆస్టరాయిడ్లు చాలా రకాల సైజుల్లో ఉంటాయి. అయితే వాటిల్లో సైకీ వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. సైకీ ఆస్టరాయిడ్‌ చాలా చాలా పెద్దది. దీని వ్యాసం ఏకంగా 140 మైళ్లు..అంటే 226 కిలోమీటర్లు. అంటే మన చంద్రుడి పరిమాణంలో సుమారు 15వ వంతు ఉంటుందన్నమాట. ఈ సైకీ గ్రహ శకలం భూమికి సుమారు 37 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.

సైకీ గ్రీకు దేవత పేరు.. దీనికి ఈపేరును ఇటలీకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు అన్నిబేల్‌ గస్పారిస్‌ ని పెట్టాడు. 1852 మార్చి 17న ఈ ఆస్టరాయిడ్‌ను తొలిసారిగా అన్నిబేల్‌ గుర్తించారు. సైంటిస్టులు చాలా కాలంగా ఈ ఆస్టరాయిడ్‌పై పరిశోధనలు చేస్తున్నారు. నాసా వచ్చే ఏడాది దీని దగ్గరికి వ్యోమనౌకను పంపించడానికి పరిశోధనలు సిద్ధమవుతోంది.

సర్వసాధారణంగా గ్రహ శకలాల్లో రాళ్లు, వివిధ మూలకాలతో కూడిన నేల, వాయువులు, మంచు ఉంటాయి. ఎక్కువగా సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ‘సైకీ’ ఆస్టరాయిడ్‌ మాత్రం చాలా వరకు లోహాలతో ఉందని అమెరికా సైంటిస్టులు గుర్తించారు. ముఖ్యంగా ఇనుము, నికెల్‌తోపాటు బంగారం, ప్లాటినం, రాగి ఇతర అరుదైన లోహాలు ఉన్నాయని అంచనా వేశారు. సౌర కుటుంబంలో ఇప్పటివరకు గుర్తించిన అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లలో అన్నింటికన్నా ‘సైకీ’ ఆస్టరాయిడ్‌ భిన్నమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సైంటిస్టు కేథరిన్‌ డిక్లీర్‌ తెలిపారు. అంతేకాదు సైకీ మీద ఉన్న లోహాలను భూమి మీదకు తీసుకుని వస్తే.. ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని కిన్తున్నారు. సైకిలోని లోహాల విలువ కనీసం 72 లక్షల కోట్ల కోట్లు (10 వేల క్వాడ్రిలియన్‌ డాలర్లు) ఉంటుందని శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్కిన్స్‌ టాంటన్‌ అంచనా వేశారు.

సైకీ ఆస్టరాయిడ్‌పై పరిశోధన చేయడానికి నాసా శాస్త్రవేత్తలు 2022 మార్చిలో వ్యోమనౌక ‘సైకీ స్పేస్‌క్రాఫ్ట్‌’ను పంపనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్యోమోనౌక మూడున్నరేళ్లు ప్రయాణించి 2026 లో సైకీని చేరుకుంటుంది. అప్పుడు రెండున్నరేళ్లు సైకి చుట్టూ చక్కర్లు కొడుతూ.. సైకీ గురించి వివరాలను సైంటిస్టులకు చేరవేస్తుంది.

Also Read: Phoolan Devi: కొందరికి సివంగి.. మరికొందరికి అమ్మోరు తల్లి.. నేడు బందిపోటు రాణి జయంతి..