Samantha Akkineni: మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించనున్న సమంత.. శాకుంతలం కోసం ఇలా..

అక్కినేని కోడలు పిల్ల పెళ్లి తర్వాత ఆచితూచి అడుగులేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్యను పేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల విషయంలో..

Samantha Akkineni: మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించనున్న సమంత.. శాకుంతలం కోసం ఇలా..
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 11, 2021 | 9:46 AM

Samantha Akkineni: అక్కినేని కోడలు పిల్ల పెళ్లి తర్వాత ఆచితూచి అడుగులేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్యను పేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇటీవలే డిజిటర్ రంగంలో అడుగుపెట్టిన ఈ చిన్నది మొదటి సిరీస్‌‌‌‌‌తోనే ఘన విజయం అందుకుంది. సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్‌‌‌‌లో రాజీ అనే పాత్రలో కనిపించి ఆకట్టుకుంది సామ్. ఈ సిరీస్‌‌‌‌‌లో నెగిటివ్‌‌‌‌‌షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది సామ్. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలను చేసిన సమంత ఒకటి రెండు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసింది. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమాలో నటిస్తుంది ఈ అందాల భామ. మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించనుంది ఈ సమంత.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు వారి వారసులు అర్షా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిన్నారి తన షూటింగ్ పార్ట్‌‌‌‌‌ను పూర్తి చేసింది. ఇక సమంత ఈ మద్య కాలంలో నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సంబంధించి ఫిజిక్ మొదలుకుని నటన వరకు ఎంతో కష్టపడుతోంది. శాకుంతలం సినిమాలో సమంత నటన ది బెస్ట్‌‌‌‌గా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాలో సమంత నటన ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anikha Surendran: టాలీవుడ్‏లోకి మరో మలయాళీ ముద్దుగుమ్మ.. క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు..

RK Selvamani: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. హీరో శింబుపై తీవ్ర ఆరోపణలు చేసిన రోజా భర్త సెల్వమణి..

Meera Mithun: బిగ్‏బాస్ బ్యూటీపై మండిపడుతున్న నెటిజన్లు… 7 సెక్షన్ల కింద కేసు నమోదు.. ఇంతకీ ఏం చేసిందంటే..