Sridevi Soda Center: లైటింగ్ సూరిబాబు – సోడాల శ్రీదేవి మధ్య అందమైన ప్రేమ గీతం..
యంగ్ హీరో సుదీర్ బాబు త్వరలో శ్రీదేవి షోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమాను..
Sridevi Soda Center: యంగ్ హీరో సుదీర్ బాబు త్వరలో శ్రీదేవి షోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమాను’పలాస 1978′ ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి. అలాగే ఇటీవల విడుదలైన ‘మందులోడా ఓరి మాయాలోడా’ అనే మాస్‌సాంగ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ”నాలో ఇన్నాళ్లుగా” అనే సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘నాలో ఇన్నాళ్లుగా కనిపించని ఏదో ఇదీ.. లోలో కొన్నాళ్లుగా నాతో ఏదో అంటున్నదీ..’ అంటూ సాగే ఈ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు.
లైటింగ్ సూరిబాబు – సోడాల శ్రీదేవి పాత్రల్లో నటిస్తున్న సుధీర్ బాబు – ఆనంది ఒకరి మీద ఒకరికున్న భావాలను ఈ పాటలో అందంగా చూపించారు. ఈ పాటను దినకర్ – రమ్య బెహర కలిసి ఆలపించారు. ఈ సినిమాకు మెలోడీ భ్రమ మణిశర్మ సంగీతం అందించారు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించగా.. ఇందులో పావెల్ నవగీతన్, నరేష్, సత్యం రాజేష్, రఘుబాబు, అజయ్ , హర్షవర్ధన్, సప్తగిరి,రోహిణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :