Rashmika Mandanna: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లక్కీ బ్యూటీ.. రష్మిక ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

టాలీవుడ్‌‌‌‌లో కొత్త అందాల హడావిడి ఎక్కువైంది. చాలా మంది హీరోయిన్లు తెలుగు తెరను పలకరిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా..

Rashmika Mandanna: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లక్కీ బ్యూటీ.. రష్మిక ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
Rashmika
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 11, 2021 | 8:42 AM

Rashmika Mandanna: టాలీవుడ్‌‌‌‌లో కొత్త అందాల హడావిడి ఎక్కువైంది. చాలా మంది హీరోయిన్లు తెలుగు తెరను పలకరిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా అలావచ్చిందే. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఆ వయ్యారి ఎవరో కాదు..లక్కీ బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ సోయగం… ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌‌‌గా కంటిన్యూ అవుతోంది. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌‌‌‌గా మారిపోయింది. స్టార్ హీరోలకు ఈ అమ్మడు ఇప్పుడు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. మొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో మెరిసిన ఈ భామ. ఒక్కసారిగా సూపర్ స్టార్ సరసన ఛాన్స్ దక్కించుకొని అందరికి షాక్ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌‌‌ను సొంతం చేసుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప సినిమాలో చేస్తోంది రష్మిక. ఇక తెలుగులోనే కాదు తమిళ్‌‌‌‌లోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఇటీవలే అక్కడ హీరో కార్తీతో కలిసి సుల్తాన్ అనే సినిమా చేసింది. ఈ సినిమా అక్కడ మంచి టాక్‌‌‌ను సొంతం చేసుకుంది. దాంతో తమిళ్‌‌‌లోనూ రష్మికాకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలాగే బాలీవుడ్‌‌‌లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. అమితాబ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న గుడ్ బై అనే సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌‌‌గా ఉంటోంది. రశ్మికాకు నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌‌‌‌స్టా‌‌‌గ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్లకు చేరింది. తక్కువ సినిమాలతోనే ఈ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకోవడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది కాబట్టి ఫాలోవర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఈ చిన్నది ముందు ముందు ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anikha Surendran: టాలీవుడ్‏లోకి మరో మలయాళీ ముద్దుగుమ్మ.. క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు..

RK Selvamani: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. హీరో శింబుపై తీవ్ర ఆరోపణలు చేసిన రోజా భర్త సెల్వమణి..

Meera Mithun: బిగ్‏బాస్ బ్యూటీపై మండిపడుతున్న నెటిజన్లు… 7 సెక్షన్ల కింద కేసు నమోదు.. ఇంతకీ ఏం చేసిందంటే..

ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
ఫార్మా GCCలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. 25 లక్షల కొత్త ఉద్యోగాలు
ఫార్మా GCCలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. 25 లక్షల కొత్త ఉద్యోగాలు
ఇదెక్కడి అన్యాయం బ్రో.. ఆ ముగ్గురికి మాత్రం మరోసారి మొండిచేయి
ఇదెక్కడి అన్యాయం బ్రో.. ఆ ముగ్గురికి మాత్రం మరోసారి మొండిచేయి
సంక్రాంతికి ఊరెళుతున్నారా...? అయితే ఈ అలర్ట్ మీకోసమే!
సంక్రాంతికి ఊరెళుతున్నారా...? అయితే ఈ అలర్ట్ మీకోసమే!
గేమ్ ఛేంజర్ సినిమా .. నటీనటుల పారితోషికాలు ఎంతంటే..
గేమ్ ఛేంజర్ సినిమా .. నటీనటుల పారితోషికాలు ఎంతంటే..
భార్య ఫోన్‏లో  స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. ?
భార్య ఫోన్‏లో  స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. ?
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
రిసెప్షన్‌లో ఈ పని ఏందిరయ్యా.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని..
రిసెప్షన్‌లో ఈ పని ఏందిరయ్యా.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని..
తిరుపతి తొక్కిసలాట ఘటన- మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటన
తిరుపతి తొక్కిసలాట ఘటన- మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటన