Viral Video : రెండు పులులు ఎదురుపడితే ఎలా ఉంటుందో తెలుసా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Viral Video : అడవిలో పులి గర్జన వింటే సమీపాన ఉండే జనాలు ఉలిక్కి పడుతారు. అలాంటిది రెండు పులులు కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ పోరాటం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

Viral Video : రెండు పులులు ఎదురుపడితే ఎలా ఉంటుందో తెలుసా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Two Tigers
Follow us

|

Updated on: Aug 10, 2021 | 1:54 PM

Viral Video : అడవిలో పులి గర్జన వింటే సమీపాన ఉండే జనాలు ఉలిక్కి పడుతారు. అలాంటిది రెండు పులులు కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ పోరాటం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రమాదకరమైన పులుల పోరాటానికి సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కర్ణాటక నాగరహోల్ నేషనల్ పార్క్‌లో ఈ పోరాటం జరిగింది. అడవిని తిలకించేందుకు వెళ్లిన ఓ పర్యాటకుడు ఈ వీడియో తీశాడు.

ఈ వీడియోను బిఎస్ సురన్ అనే వ్యక్తి ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. వీడియోలో మొదటగా రెండు పులులు ఒకరినొకరు ఎదురుపడుతాయి. భయంకరంగా గర్జిస్తాయి. తర్వాత రెండు ఒకదానిపై ఒకటి పోరాటానికి దిగుతాయి. పదునైన గోళ్లతో లోతైన గాయం చేయడానికి ప్రయత్నిస్తాయి. వెనుక కాళ్లపై నిలబడి రెండు పులులు బాక్సర్‌ల వలె పంజా విసురుకోవడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ యుద్ధ సమయంలో అడవి మొత్తం పులి గర్జనతో రీ సౌండ్ వినిపిస్తుంది.

పులుల గర్జనతో ఆ ప్రాంతం యుద్దరంగంగా మారిపోయింది. పులి ఒక ప్రాదేశిక జంతువు దాని ప్రాంతంలో ఏ ఇతర పులి ఉండటం అస్సలు ఇష్టపడదు. తన ప్రాణాలను పణంగా పెట్టయినా సరే తన ప్రాంతాన్ని కాపాడుకుంటుంది. వైరల్ వీడియోలో కనిపించిన రెండు పులులు మ్యాచ్ అయినట్లు కనిపిస్తున్నాయి. ఒక పులి మరొకరి భుజంపై తన పంజాను చాలా లోతుగా వేసి కింద పడేస్తుంది. కానీ ఆ ప్రాంతాన్ని వదులుకోవడానికి రెండు పులులు సిద్ధంగా లేనట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. కామెంట్స్, షేర్స్ చేస్తున్నారు. అటవీ జంతువుల వీడియోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతాయన్న సంగతి అందరికి తెలిసిందే.

32 బంతుల్లో సెంచరీ.. 7ఫోర్లు.. 11 సిక్సర్లు.. టీ10లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ‘ఇండియన్’ బ్యాట్స్‌మెన్

NASA : అంగారక గ్రహంపైకి వెళ్లాలని ఉందా..! అయితే అర్హతలు ఏంటి.. దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

Huzurabad by Election: హుజూరాబాద్‌ వాసులకు గులాబీ లేఖలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త ఎత్తుగడ..