Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుండేది.. రాంగ్ రూటులో వచ్చి కాళ్లు విరొగ్గొట్టుకున్న మహిళలు.. షాకింగ్ వీడియో..

Anantapur Viral Video: ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలని.. తరచూ బెబుతుంటారు. కానీ ఏ ఒక్కరూ కూడా పట్టించుకోరు. ఒక్క నిమిషం ఆచితూచి వేసే అడుగు.. భవిష్యత్తుకు కీలకంగా

Viral Video: ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుండేది.. రాంగ్ రూటులో వచ్చి కాళ్లు విరొగ్గొట్టుకున్న మహిళలు.. షాకింగ్ వీడియో..
Accident Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 10, 2021 | 12:35 PM

Anantapur Viral Video: ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలని.. తరచూ బెబుతుంటారు. కానీ ఏ ఒక్కరూ కూడా పట్టించుకోరు. ఒక్క నిమిషం ఆచితూచి వేసే అడుగు.. భవిష్యత్తుకు కీలకంగా మారుతుందని పేర్కొంటుంటారు. కానీ.. ఆ ఒక్క సెకన్ అజాగ్రత్తగా ఉండటం వల్ల ఏమవుతుందో ఈ సంఘటన అద్దం పడుతోంది. రాంగ్ రూటులో బైక్‌పై వచ్చిన ఇద్దరు మహిళల కాళ్లు విరిగాయి. ఏపీలోని అనంతపురం పట్టణంలో జరిగిన ఈ ఘటన వీడియో ప్రస్తుతం.. సోషల్ మీడియా అంతటా వైరల్‌గా మారింది. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఆర్టీసీ బస్సు కింద ద్విచక్ర వాహనం పడి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గాయపడ్డ మహిళలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

వైరల్ వీడియో..

క్లాక్ టవర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బస్సు ఆగింది. సిగ్నల్ పడిన వెంటనే బస్సు ముందుకు బయలుదేరింది. ద్విచక్రవాహనంపై రాంగ్ రూట్లో వచ్చిన ఇద్దరు మహిళలు బస్సు ముందు వైపు నుంచి వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో టర్న్ అవుతుండగా.. బైక్‌ను బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం బస్సు ముందు చక్రం కింద పడింది. దీంతో మహిళల కాళ్లు విరిగిపోయాయి. ఈ ఘటన భయంకరంగా ఉంది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిదానమే ప్రధానం.. ఆలస్యమైనా ముందు వెనుక చూసి ప్రయాణించండి అంటూ నెటిజన్లు వీడియోను షేర్ చేస్తున్నారు. అనవసరంగా రాంగ్ రూట్లో వస్తే ఇలాంటి ప్రమాదాల బారిన పడతారని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ సంఘటన ఆదివారం జరిగింది.

లక్ష్మికాంత్, అనంతపురం జిల్లా, టీవీ9 తెలుగు

Also Read:

Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి మరో షాక్.. ఆమెతోపాటు.. తల్లిపై చీటింగ్‌ కేసు

AP Crime: బొమ్మ తుపాకీతో దొంగతనానికి భారీ ప్లాన్.. కట్ చేస్తే.. చివరకు ఇలా చిక్కాడు..