CJI NV Ramana: సమాంతరంగా చర్చలు జరగడం దురదృష్టకరం.. పెగాసస్‌ విచారణలో CJI NV రమణ కీలక వ్యాఖ్యలు..

పెగసస్‌ అంశంపై సుప్రీంలో విచారణ జరిగింది. ఫైల్‌ చేసిన పిటిషన్లు అన్నీ తనకు అందాయని..అయితే ప్రభుత్వం నుంచి తనకు సమాచారం రావాల్సి ఉందని కోర్టుకు తెలిపారు ఎస్జీ తుషార్‌ మెహతా. అందుకు కొంత..

CJI NV Ramana: సమాంతరంగా చర్చలు జరగడం దురదృష్టకరం.. పెగాసస్‌ విచారణలో  CJI NV రమణ కీలక వ్యాఖ్యలు..
Cji Justice N.v. Ramana
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 10, 2021 | 12:17 PM

పెగసస్‌ అంశంపై సుప్రీంలో విచారణ జరిగింది. ఫైల్‌ చేసిన పిటిషన్లు అన్నీ తనకు అందాయని..అయితే ప్రభుత్వం నుంచి తనకు సమాచారం రావాల్సి ఉందని కోర్టుకు తెలిపారు ఎస్జీ తుషార్‌ మెహతా. అందుకు కొంత గడువు కావాలని కోరారు. దీంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీం. పెగాసస్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ ఎన్వీ రమణ. కోర్టులు జరిపే విచారణలపై నమ్మకం ఉండాలన్నారు. విచారణ సమయంలో సమాంతరంగా చర్చలు జరగడం దురదృష్టకరమన్నారు.

పెగసస్​ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరగాలని కోరుతూ దాఖలైన పలు పటిషన్లపై విచారణ చేపట్టింది సుప్రీం ధర్మానం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని  ధర్మానం కీలక వ్యాఖ్యలు చేశారు .

” కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే సమాంతరంగా చర్చలు జరగడం దురదృష్టకరం. కోర్టులు జరిపే విచారణలపై విశ్వాసం, నమ్మకం ఉండాలి. కోర్టు హాళ్లలో క్రమశిక్షణతో కూడిన చర్చలు జరగాలని తామెప్పుడూ కోరుకుంటాం. వాద, ప్రతివాదులు సమాచారపరంగా సహకరిస్తారని ఆశిస్తున్నాం. పిటిషనర్లు చెప్పాలనుకున్న విషయాలను అఫిడవిట్​ రూపంలో సమర్పించాలి. సామాజిక మాధ్యమాలు, బయట జరిగే చర్చలకు పరిధి ఉండాలి.” అని సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ అన్నారు.

ఈ సందర్భంగా తమ కక్షిదారులు పరిధి దాటి వెళ్లకుండా చూస్తామని ధర్మాసనాని తెలిపారు సీనియర్​ న్యాయవాదులు. కక్షిదారులు ఇష్టానుసారం చర్చలు జరపకుండా సామాజిక మాధ్యమాల్లో చర్చలకు తావివ్వకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సీజేఐ ఎన్‌వీ రమణ ఆదేశాలను పరిశీలనలోకి తీసుకోవాల్సిందేనన్నారు సీనియర్​ న్యాయవాది కాంగ్రెస్​ నేత కపిల్​ సిబల్​.

విచారణ సందర్భంగా అన్ని పిటిషన్లకు సంబంధించిన నకలు పత్రాలు తమకు అందాయని కోర్టుకు తెలిపారు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. ప్రభుత్వం నుంచి తనకు సమాచారం రావాలని.. అందుకు కొంత సమయం కావాలని విన్నవించారు. ఈ క్రమంలో విచారణను సోమవారానికి(ఆగస్టు 16) వాయిదా వేసింది ధర్మాసం.

ఇవి కూడా చదవండి:  Simple Cooking Tips: మీకు స్టిక్కీ రైస్‌ను వండటం ఎలానో తెలుసా.. ఈ వంటను చాలా రుచిగా తయారు చేయాలంటే ఇలా చేయండి…

Nakli Paneer: మీరు తింటున్న పన్నీరు నకిలీ కావచ్చు..ఇంటికి తీసుకువచ్చిన వెంటనే నిజమైనదాన్ని ఇలా గుర్తించండి

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?