Jantar Mantar: జంతర్ మంతర్ వద్ద ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసిన బీజేపీ నేతతో సహా ఐదుగురి అరెస్ట్
ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఈ నెల 8 న జరిగిన నిరసన ప్రదర్శనలో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసిన అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో బీజేపీ నేత, ఈ ప్రొటెస్ట్ మార్చ్ ను నిర్వహించిన అశ్వినీ ఉపాధ్యాయ కూడా ఉంన్నారు. వీరందరినీ నిన్న రాత్రి
ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఈ నెల 8 న జరిగిన నిరసన ప్రదర్శనలో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసిన అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో బీజేపీ నేత, ఈ ప్రొటెస్ట్ మార్చ్ ను నిర్వహించిన అశ్వినీ ఉపాధ్యాయ కూడా ఉంన్నారు. వీరందరినీ నిన్న రాత్రి పోలీసులు చాలా సేపు ఇంటరాగేట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నవారిలో కొందరు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడమే కాక..ఇండియాలో ఉండాలంటే జై శ్రీరామ్ అని నినదించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కొందరిని గుర్తించారు. ఈ ఘటనలో ఇందుకు బాధ్యులైనవారిని పోలీసులు అరెస్టు చేయలేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మొదట పార్లమెంటులో ఆరోపించారు. ఈ విధమైన చర్యలపట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. కాగా ఈ ప్రదర్శనకు తమ అనుమతి లేదని, అయినా ఈ మార్చ్ నిర్వహించారని పోలీసులు పేర్కొన్నారు.
టీవీ నటుడు, బీజేపీ లీడర్ గజేంద్ర చౌహాన్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నట్టు తెలిసింది. కానీ వీడియో క్లిప్ లో ఆయన కనిపించలేదు. అసలు ఈ నినాదాలు చేసినవారెవరో తనకు తెలియదని అశ్వినీ ఉపాధ్యాయ అంటున్నారు. కాలం చెల్లిన సామ్రాజ్యవాద చట్టాలకు స్వస్తి చెప్పాలంటూ సేవ్ ఇండియా ఫౌండేషన్ ఈ ప్రొటెస్ట్ నిర్వహించిందని ఆయన చెప్పారు. ఈ సంస్థ డైరెక్టర్ ప్రీత్ సింగ్ కూడా అరెస్టయినవారిలో ఉన్నారు. పార్లమెంటుకు సమీపంలోనే జరిగిన ఈ నిరసన ప్రదర్శన నగరంలో సంచలనం సృష్టించింది.
మరిన్ని ఇక్కడ చూడండి : Taliban Live Video: తాలిబన్లు ఘాతుకం.. బిగుతుగా డ్రెస్ వేసుకుందని మహిళ హతం..