AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేరగ్రస్త రాజకీయాలపై ‘కొరడా’..అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను పార్టీలు ప్రచురించాలని సుప్రీంకోర్టు తీర్పు

దేశంలో నేరగ్రస్త రాజకీయాలకు తావు లేకుండా చూసేందుకు సుప్రీంకోర్టు నడుం బిగించింది. తమ ఎంపికకు 48 గంటలముందు అభ్యర్థులు తమ క్రిమినల్ చరిత్రను ప్రకటించేలా ఆయా పార్టీలు చూడాలని, వాటిని ప్రచురించాలని సూచించింది.

నేరగ్రస్త రాజకీయాలపై 'కొరడా'..అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను పార్టీలు ప్రచురించాలని సుప్రీంకోర్టు తీర్పు
Supreme Court
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 10, 2021 | 12:52 PM

Share

దేశంలో నేరగ్రస్త రాజకీయాలకు తావు లేకుండా చూసేందుకు సుప్రీంకోర్టు నడుం బిగించింది. తమ ఎంపికకు 48 గంటలముందు అభ్యర్థులు తమ క్రిమినల్ చరిత్రను ప్రకటించేలా ఆయా పార్టీలు చూడాలని, వాటిని ప్రచురించాలని సూచించింది. న్యాయమూర్తులు ఆర్.ఎఫ్.నారిమన్, బీ.ఆర్. గవాయ్ లతో కూడిన బెంచ్ ఈ మేరకు తాము గత ఏడాది ఫిబ్రవరి 13 న ఇచ్చిన తీర్పును సవరించింది. తమ అభ్యర్థుల నేర చరిత్రను ప్రకటించని పలు పొలిటికల్ పార్టీలు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నాయని, వాటిపై చర్య తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను బెంచ్ విచారించింది. బీహార్ ఎన్నికల సందర్బంగా వివిధ పార్టీల క్యాండిడేట్స్ తమ క్రిమినల్ చరిత్రను తమ ఎంపికకు 48 గంటల్లోగా గానీ లేదా రెండు వారాల ముందు గానీ ప్రకటించాలని,, ఈ రికార్డులను ఆయా పార్టీలు ప్రచురించాలని గత ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఆదేశించింది. వీటిని అవి తమ వెబ్ సైట్లలో, రెండు వార్తా పత్రికల్లో తప్పనిసరిగా ప్రచురించాలని కూడా సూచించింది. అలాగే అభ్యర్థిని ఎంపిక చేసిన 72 గంటల్లోగా పార్టీలు తమ నివేదికలను ఎన్నికల సంఘ్జానికి పంపాలని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

దేశంలోని పాలిటిక్స్ నేరమయంగా మారిపోతుండడం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.గత నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లో ఈ విధమైన క్రిమినల్ ‘ఉదంతాలు’ పెరిగిపోయాయి. 2004 లో 24 శాతం మంది ఎంపీలకు నేర చరిత్ర ఉండగా.. 2009 లో అది 30 శాతానికి, 2014 లో 34 శాతానికి, 2019 లో 43 శాతానికి పెరిగినట్టు జస్టిస్ నారిమన్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ.. రాజకీయాల్లో క్రిమినల్స్ చేరకుండా చూసేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని అభిప్రాయపడ్డాయి.

మరిన్ని ఇక్కడ చూడండి : Taliban Live Video: తాలిబన్లు ఘాతుకం.. బిగుతుగా డ్రెస్ వేసుకుందని మహిళ హతం..

 ‘మా‘ పాలిటిక్స్‌కు ‘మెగా’ టచ్..!ప్రస్తుత పరిణామాలపై చిరు సీరియస్..క్రిష్ణంరాజుకు లేఖ..:MAA Elections Controversy Live Video.

 వంటలక్క ఇంట బర్త్‌డే హంగామా..!సందడి చేసిన డాక్టర్ బాబు..ఇంతకీ బర్త్ డే ఎవరిదో తెలుసా..:Karthikadeepam vantalakka Video.

 బైక్‌ షోరూమ్‌లో స్మార్ట్‌ దొంగలు.. వీళ్ల తెలివికి ఆస్కార్‌ ఇచ్చినా తక్కువే.!షాక్ లో ఓనర్స్..:Smart thieves in bike showroom Video.