Covaxin: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుజరాత్‌లో కోవాగ్జిన్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్
Bharath Biotech Covaxin: దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. థర్డ్ వేవ్ పొంచి ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో కేంద్రం ప్రభుత్వం..
Bharath Biotech Covaxin: దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. థర్డ్ వేవ్ పొంచి ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో కేంద్రం ప్రభుత్వం.. ప్రతిరోజూ వ్యాక్సిన్ డోసులను లక్షల్లో పంపిణీ చేస్తోంది. దీంతోపాటు పలు వ్యాక్సిన్ల ఉత్పత్తి దృష్టిసారించి.. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వలు తగ్గకుండా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కోవిడ్ వ్యాక్సిన్ టీకాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు తీసుకుని.. పలు కేంద్రాలకు అనుమతి సైతం ఇస్తోంది. దీనిలో భాగంగా స్వదేశీ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఉత్పత్తికి మరో కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో కోవాగ్జిన్ టీకా ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు.
దేశీయంగా.. భారత్ బయోటెక్ సంస్థ కోవిడ్ టీకాల పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తోంది. కేవలం హైదరాబాద్ యూనిట్ నుంచి మాత్రమే కోవాగ్జిన్ ఉత్పత్తి జరుగుతోంది. ఇక నుంచి అంకలేశ్వర్ యూనిట్ నుంచి కూడా ఉత్పత్తి ప్రారంభం కానుంది. జనవరి నుంచి ఆగస్టు వరకు 7 కోట్ల టీకా డోసులను భారత్‌బయోటెక్ ఉత్పత్తి చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ మాత్రం అత్యధికంగా 44 కోట్ల వరకు టీకాలను ఉత్పత్తి చేసింది.
కాగా.. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్.. కోవిడ్ లక్షణాలు ఉన్న వారిపై 77.8 శాతం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దీంతోపాటు డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 65.62 శాతం ప్రభావవంతంగా చూపుతున్నట్లు సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.
Also Read: