NEET 2021: నీట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారా.? అప్లై చేసుకోవడానికి నేడే చివరి తేదీ. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

NEET 2021: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నీట్‌ (National Eligibility Cum Entrance Test) పరీక్ష దరఖాస్తుల స్వీకరణ నేటితో (మంగళవారం) ముగియనుంది. నిజానికి ఈ గడువు గతంలోనే ముగిసినప్పటికీ కరోనా నేపథ్యంలో...

NEET 2021: నీట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారా.? అప్లై చేసుకోవడానికి నేడే చివరి తేదీ. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Neet Exam
Follow us

|

Updated on: Aug 10, 2021 | 2:08 PM

NEET 2021: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నీట్‌ (National Eligibility Cum Entrance Test) పరీక్ష దరఖాస్తుల స్వీకరణ నేటితో (మంగళవారం) ముగియనుంది. నిజానికి ఈ గడువు గతంలోనే ముగిసినప్పటికీ కరోనా నేపథ్యంలో దరఖాస్తు గడువును పెంచుతూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. నీట్‌ దరఖాస్తుల ప్రక్రియ గత నెల 13న ప్రారంభంకాగా.. ఆగస్టు 6ను చివరి తేదీగా ప్రకటించారు. అయితే కరోనా కారణంగా ఆ గడువును ఆగస్టు 10వ తేదీ (నేడు) వరకు పొడగించారు. దీంతో ఈరోజు (మంగళవారం) దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. కాబట్టి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ సౌకర్యం ఆగస్టు 11న మొదలై ఆగస్టు 14న ముగుస్తుందని తెలిపారు.

ఇదిలా ఉంటే బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే నీట్‌లో అర్హత సాధించాల్సిందే అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతంలోనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సిఫారసుల మేరకు బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పరీక్షను తప్పనిసరి చేశారు. నీట్‌ అర్హత ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఎలా అప్లై చేసుకోవాలంటే..

* దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ముందుగా నీట్‌ అధికారిక వెబ్‌సైట్‌ neet.nta.nic.in.లోకి వెళ్లాలి. * అనంతరం హోమ్‌ పేజీలో ఉండే ‘నీట్‌ 2021’ లింక్‌పై క్లిక్‌ చేయాలి. * తర్వాత రిజిస్ట్రేషన్‌ కోసం అవసరమైన అన్ని వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. * కేటాయించిన అప్పలికేషన్‌ ఫీజును చెల్లించాలి. * తర్వాత కన్ఫామ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. దీంతో మీ అప్లికేషన్‌ రిజిస్టర్‌ అవుతుంది. * భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అప్లికేషన్‌ ఫామ్‌ను ప్రింట్‌ అవుట్ తీసుకోవాలి.

Also Read: China Anthrax: చైనాలో మరో ప్రాణాంతక మహమ్మారి.. గుబులు పుట్టిస్తున్న ఆంత్రాక్స్ న్యుమోనియా

32 బంతుల్లో సెంచరీ.. 7ఫోర్లు.. 11 సిక్సర్లు.. టీ10లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ‘ఇండియన్’ బ్యాట్స్‌మెన్

Kitchen Tips: మీ ఇంట్లో కూరగాయలు తాజాగా ఉండాలా.. 15 రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండేందుకు ఇలా చేయండి..