Hiring Trends 2021: మీరు గొప్ప ప్రోగ్రామర్లయినా సరే ఆ లక్షణం లేకపోతే వృథా.. ఎల్‌ అండ్‌ టీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వ్యాఖ్యలు.

Hiring Trends 2021: ఐటీ రంగంలో రోజుకో కొత్త విప్లవం పుట్టుకొస్తోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా ఐటీ రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా అభ్యర్థులు...

Hiring Trends 2021: మీరు గొప్ప ప్రోగ్రామర్లయినా సరే ఆ లక్షణం లేకపోతే వృథా.. ఎల్‌ అండ్‌ టీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వ్యాఖ్యలు.
Hiring Trends 2021
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 10, 2021 | 12:56 PM

Hiring Trends 2021: ఐటీ రంగంలో రోజుకో కొత్త విప్లవం పుట్టుకొస్తోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా ఐటీ రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా అభ్యర్థులు నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే గొప్పగా ప్రోగ్రామింగ్ రాసే వారైనా సరే కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి, కొత్త రకం ప్రాజెక్టులను ఎంచుకుని నేర్చుకునే లక్షణం లేకపోతే వృథా అని చెబుతున్నారు ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఆపరేటింగ్‌ ఆపీసర్‌ అభిషేక్‌. తాను మాత్రం ప్రోగ్రామింగ్‌ బాగా వచ్చిన వారికంటే కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఉత్సుహకతతో ఉన్నవారినే ఎంచుకుంటానని చెబుతున్నారు. ప్రస్తుతం నియామకాల ట్రెండ్ ఎలా మారింది. కరోనా ప్రభావం ఎలా ఉంది లాంటి ఆసక్తికర విశేషాలను ఆయన పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఎమన్నారంటే..

ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ మొదటి క్వార్టర్‌లో 350 ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఉద్యోగంలోకి తీసుకుంది. ఇక ఏడాది ముగిసే నాటికి 1400-1600 మందిని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. నియామకాలు పెరగడానికి పలు రకాల కారణాలున్నయాని అభిషేక్‌ తెలిపారు.

కరోనా మహమ్మారి ఐటీ రంగంలో నియామకాల తీరును మార్చిందా..?

రిక్రూట్‌మెంట్‌ విధానం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ కారణంగా భారత్‌లో ఉద్యోగులతోపాటు వ్యాపారులు కూడా ఎక్కడి నుంచైనా పనిని పూర్తి చేయగలరనే అంచనాకు వచ్చారు. దాదాపు అన్ని కంపెనీలు ఈ విధానాన్ని అవలంభించడానికే మొగ్గు చూపుతున్నాయి. ఈ కారణంగా సంస్థల ఆదాయం కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఆగిపోయిన చాలా ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి. దీంతో ఉద్యోగల సంఖ్య పెరుగుతోంది.

ఆలోచన ఉన్న కంపెనీలు అలాంటి నిర్ణయమే తీసుకుంటాయి..

స్మార్ట్‌గా ఆలోచించే కంపెనీలు ఎక్కువగా క్యాంపస్‌ ఇంటర్వ్యూలకే ప్రాధాన్యత ఇస్తాయి. మా వరకు వస్తే మేము కేవలం భారత దేశానికి చెందినవి మాత్రమే కాకుండా విదేశాల్లోని విద్యాసంస్థలతోనూ మంచి సత్సంబంధాలను కలిగిఉంటాం. ఇక మేము తీసుకున్న ఉద్యోగి ఎవరైనా మా కంపెనీని వదిలి వెళ్లరనేది మా ప్రగాఢ విశ్వాసం. గతేడాది కరోనా కారణంగా మేము క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టకపోయినప్పటికీ విద్యార్థులతో టచ్‌లోనే ఉన్నాం. వారికి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చాం. ఇందులో భాగంగానే ఇన్‌స్టెప్‌, జెనిసిస్‌, స్టెప్‌ఇన్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహించాము. దీనివల్ల మేము విద్యార్థులను తీసుకోగానే ఎలాంటి శిక్షణ లేకుండానే ప్రాజెక్టులోకి తీసుకుంటాం.

ఫ్రెషర్స్‌ను మరింత ఎక్కువగా తీసుకుంటాం..

రానున్న రోజుల్లో ఫ్రెషర్స్‌ను మరింత పెద్ద సంఖ్యలో తీసుకోనున్నాం. గతేడాది దీంట్లో కాస్త వేగం తగ్గినప్పటికీ ఈ ఏడాది వేగం పుంజుకుంటుంది. ఈ ఏడాది కచ్చితంగా ఫ్రెషర్స్‌ను తీసుకునే సంఖ్య పెరుగుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, వాటిలో కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తుండడం ఒకటి. వీటి కారణంగా అనుభవం ఉన్న వారిని తీసుకున్నా, ఫ్రెషర్స్‌ను తీసుకున్నా శిక్షణ ఇవ్వాల్సిందే.. కాబట్టి ఫ్రెషర్స్‌ను పెద్ద ఎత్తున తీసుకునే అవకాశాలున్నాయి.

అభ్యర్థులను తీసుకునే ముందు మేము చూసేది అదే..

ఉద్యోగంలోకి తీసుకునే ముందు అభ్యర్థుల్లో చూసే అంశాలు వారు ఫ్రెషర్సా, అనుభవం ఉన్న వారా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే మొట్టమొదటి అంశం మాత్రం అభ్యర్థికి నేర్చుకునే లక్షణం ఉందా అన్న దాన్ని చూస్తాం. గొప్పగా ప్రోగ్రామింగ్ రాసే వారైనా సరే కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి, కొత్త రకం ప్రాజెక్టులను ఎంచుకుని నేర్చుకునే లక్షణం లేకపోతే వృథా. ప్రోగ్రామింగ్‌ బాగా వచ్చిన వారికంటే కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఉత్సుహకతతో ఉన్నవారినే ఎంచుకుంటాం.

మా ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేస్తామంటున్నారు..

మా సంస్థలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆఫీస్‌కు రావడానికే ఇష్టపడుతున్నారు. మళ్లీ పరిస్థితిలు పూర్తిగా మునపటిలా మారతాయని నేను అనుకోవడం లేదు. ఎల్‌అండ్‌టీతో పాటు చాలా కంపెనీలు ఉద్యోగులకోసం ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ పాలసీలను ప్రవేశపెడుతున్నాయి.

Also Read: Jantar Mantar: జంతర్ మంతర్ వద్ద ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసిన బీజేపీ నేతతో సహా ఐదుగురి అరెస్ట్

వావ్ ! దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై మహిళ…ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ యాడ్ వీడియో వైరల్

Viral Video: ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుండేది.. రాంగ్ రూటులో వచ్చి కాళ్లు విరొగ్గొట్టుకున్న మహిళలు.. షాకింగ్ వీడియో..

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!