Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి మరో షాక్.. ఆమెతోపాటు.. తల్లిపై చీటింగ్‌ కేసు

Fraud Case: బాలీవుడ్ పోర్నోగ్రఫీ కేసులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు కీలక

Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి మరో షాక్.. ఆమెతోపాటు.. తల్లిపై చీటింగ్‌ కేసు
Shilpa Shetty Sunanda Shetty
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 10, 2021 | 11:41 AM

Fraud Case: బాలీవుడ్ పోర్నోగ్రఫీ కేసులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించడంతోపాటు.. పలువురు హీరోయిన్లను సైతం విచారించారు. ఈ కేసు దర్యాప్తు అయిన తరుణంలో.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై యూపీ లక్నోలోని రెండు పోలీసు స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. శిల్పా, ఆమె తల్లి తమ వద్ద రూ.కోట్లు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ వ్యక్తులు హజరత్‌గంజ్‌, విభూతిఖండ్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఎర్పడి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్‌ సుమన్‌ అధికారిగా ఉన్నారు. కావున ఈ కేసులో ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీతోపాటు ఒక బృందం ముంబై చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

కేసు వివరాలు.. శిల్పాశెట్టి అయోసిస్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా పేరుతో ఫిటినెస్‌ సెంటర్‌ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫిట్‌నెస్ సెంటర్‌కు శిల్పా చైర్మన్‌గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫిట్‌నెస్‌ సెంటర్‌ మరో బ్రాంచ్‌ను లక్నోలో ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్‌, రోహిత్‌ వీర్‌ సింగ్‌ అనే ఇద్దరికి వారు ఫ్రాంచెజ్‌ ఇచ్చారు. అయితే.. ఈ సెంటర్‌ను ప్రారంభించేందుకు వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఆ తర్వాత దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు మోసం​చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసుపై డీసీపీ సంజీవ్‌ సుమన్‌ మాట్లాడుతూ.. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Also Read:

Pooja Hegde: బుట్టబొమ్మ, బుట్టబొమ్మా… ఇంత అందాన్ని తట్టుకునేదెలాగమ్మా.. షేక్‌ చేస్తోన్న పూజా లేటెస్ట్‌ ఫొటోలు.

MAA Elections: ‘మా’రాజులూ… మీ శాశ్వత భవనానికి ఓ మంచి ఐడియా ఉంది… ఏంటంటే?