AP Crime: బొమ్మ తుపాకీతో దొంగతనానికి భారీ ప్లాన్.. కట్ చేస్తే.. చివరకు ఇలా చిక్కాడు..

Robbery Case: ఓ వ్యక్తి భారీ స్కెచ్ వేశాడు. ఎలాగైనా దొంగతనం చేయాలని ఫిక్స్ అయిపోయాడు. బొమ్మ తుపాకీతో బంగారం షాపునకు వెళ్లాడు. కట్ చేస్తే..

AP Crime: బొమ్మ తుపాకీతో దొంగతనానికి భారీ ప్లాన్.. కట్ చేస్తే.. చివరకు ఇలా చిక్కాడు..
Ap Crime
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 10, 2021 | 9:49 AM

Robbery Case: ఓ వ్యక్తి భారీ స్కెచ్ వేశాడు. ఎలాగైనా దొంగతనం చేయాలని ఫిక్స్ అయిపోయాడు. బొమ్మ తుపాకీతో బంగారం షాపునకు వెళ్లాడు. కట్ చేస్తే.. ఆ దొంగకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. బొమ్మ తుపాకీతో బెదిరించి దుకాణంలో బంగారు నగలు దోపిడీకి యత్నించి స్థానికులకు ఓ వ్యక్తి పట్టుబడిన సంఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో చోటుచేసుకుంది.

పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురంలోని న్యూ జీకే జ్యూయలర్స్‌ దుకాణానికి సోమవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి వచ్చాడు. బంగారు నగ కావాలని కోరాడు. దీంతో యజమాని మిధున్‌ చక్రవర్తి లోపల నుంచి గొలుసులు తీసి చూపించాడు. మూడు గొలుసులు చూస్తున్నట్లు నటించిన ఆగంతకుడు, జేబులో నుంచి తుపాకీ తీసి మిధున్‌చక్రవర్తిని బెదిరించాడు. అనంతరం రెండు తులాల బరువుండే మూడు గొలుసులతో ఉడాయించే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో యజమాని ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తూనే.. కేకలు వేశారు. దీంతో నిందితుడు పారిపోయే ప్రయత్నంలో.. తుపాకీని కింద పడేసి పరుగుతీశాడు. అనంతరం సమీపంలోని వారంతా అక్కడకు చేరుకున్నారు. సమీపంలోని ఓ కాంప్లెక్స్‌లో దాగి ఉన్న ఆగంతకుడిని స్థానికులు చూసి పట్టుకున్నారు. అనంతరం బంగారం గొలుసులతో సహా నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

కాగా.. నిందితుడి పేరు రాభీ డిగాల్‌ అని, ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. తుపాకీని పరిశీలించిన సీఐ ఎం.వినోద్‌బాబు అది బొమ్మ తుపాకీగా పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Girl Death: విషాదం.. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న బీరువా.. పాఠశాలలో బాలిక దుర్మరణం..

Tirupati: చిత్తూరు జిల్లాలో నాటుబాంబుల కలకలం.. ఇళ్లపైకి వేస్తానంటూ వ్యక్తి హల్‌చల్‌, అరెస్ట్..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం