Tirupati: చిత్తూరు జిల్లాలో నాటుబాంబుల కలకలం.. ఇళ్లపైకి వేస్తానంటూ వ్యక్తి హల్‌చల్‌, అరెస్ట్..

చిత్తూరు జిల్లాలో నాటుబాంబులు కలకలం రేపాయి. మద్యం మత్తులో ఓ వ్యక్తి నాటుబాంబులతో వీరంగం సృష్టించాడు.  స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Tirupati: చిత్తూరు జిల్లాలో నాటుబాంబుల కలకలం.. ఇళ్లపైకి వేస్తానంటూ వ్యక్తి హల్‌చల్‌, అరెస్ట్..
Grenades
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 10, 2021 | 8:20 AM

చిత్తూరు జిల్లాలో నాటుబాంబులు కలకలం రేపాయి. మద్యం మత్తులో ఓ వ్యక్తి నాటుబాంబులతో వీరంగం సృష్టించాడు.  స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూటుగా తాగివచ్చిన ఓ వ్యక్తి ఇళ్లపైకి నాటు బాంబులు విసురుతానని హెచ్చరించాడు. ప్లాస్టిక్ బకెట్‌లో నాటు బాంబులను తీసుకొచ్చిన వ్యక్తి అందరిపై వేస్తానంటై భయపెట్టింది. అతను చేస్తున్న చర్యలతో జనం పరుగులు పెట్టారు. ఇళ్ల నుంచి రోడ్లపై పరుగులు పెట్టారు.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో నాటుబాంబుల తీవ్ర కలకలం రేపాయి. మద్యం మత్తులో పది నాటు బాంబులతో వీరంగం సృష్టించాడు కృష్ణయ్య అనే వ్యక్తి.

దీంతో.. ఓ నాటుబాంబు పేలింది. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఆ నాటుబాంబు పేలినా.. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి కృష్ణయ్య పరారయ్యాడు. నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి : Nakli Paneer: మీరు తింటున్న పన్నీరు నకిలీ కావచ్చు..ఇంటికి తీసుకువచ్చిన వెంటనే నిజమైనదాన్ని ఇలా గుర్తించండి

Neeraj Chopra: బంగారు పతకం ముందు బాధలన్నీ చిన్నవే: నీరజ్ చోప్రా