ఉగ్రవాదుల ఘాతుకం..జమ్మూ కాశ్మీర్ లోని అనంత నాగ్ లో బీజేపీ సర్పంచ్ దంపతుల కాల్చివేత

జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ లో బీజేపీకి చెందిన సర్పంచ్ గులాం రసూల్ దర్ ను, ఆయన భార్య జవహర్ భానును ఉగ్రవాదులు కాల్చి చంపారు. కుల్గాం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కూడా అయిన గులాం రసూల్ కొంతకాలంగా టెర్రరిస్టుల హిట్ లిస్టులో ఉన్నట్టు తెలిసింది.

ఉగ్రవాదుల ఘాతుకం..జమ్మూ కాశ్మీర్ లోని అనంత నాగ్ లో బీజేపీ సర్పంచ్ దంపతుల కాల్చివేత
Jammu And Kashmir Terrorists Shot Dead Bjp Sarpanch
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 10, 2021 | 10:17 AM

జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ లో బీజేపీకి చెందిన సర్పంచ్ గులాం రసూల్ దర్ ను, ఆయన భార్య జవహర్ భానును ఉగ్రవాదులు కాల్చి చంపారు. కుల్గాం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కూడా అయిన గులాం రసూల్ కొంతకాలంగా టెర్రరిస్టుల హిట్ లిస్టులో ఉన్నట్టు తెలిసింది. నిన్న జరిగిన ఈ ఘాతుకంలో ఈ దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందారు. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా హస్తం ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. తమ అద్దె ఇంటిలోనే వీరు ఉగ్రవాదుల కాల్పులకు గురైనట్టు వారు చెప్పారు. గత ఏడాది జరిగిన జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లో గులాం రసూల్ పోటీ చేసి ఓడిపోయారు. కుల్గాం లోని రేద్వానీ ప్రాంత నివాసి అయిన ఈయనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని తెలిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి భద్రత సౌకర్యం లభించలేదు.

గత శనివారం ఇదే కుల్గాం జిల్లాలో ఓ పోలీసును టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఉగ్రవాదులను, వారికి సాయపడుతున్నవారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పిలుపునిచ్చిన మరునాడే ఈ ఘటన జరిగింది. అటు బీజేపీ సర్పంచ్ ఆయన భార్య కాల్చివేతను మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపందల చర్య అని పేర్కొంటూ.. ఈ హత్యలకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను, భద్రతా దళాలను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతకు సెక్యూరిటీ దళాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. స్థానికుల్లో కొందరు వీరికి సహకరిస్తున్న కారణంగా అవి నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వినవస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి : ‘మా‘ పాలిటిక్స్‌కు ‘మెగా’ టచ్..!ప్రస్తుత పరిణామాలపై చిరు సీరియస్..క్రిష్ణంరాజుకు లేఖ..:MAA Elections Controversy Live Video.

 వంటలక్క ఇంట బర్త్‌డే హంగామా..!సందడి చేసిన డాక్టర్ బాబు..ఇంతకీ బర్త్ డే ఎవరిదో తెలుసా..:Karthikadeepam vantalakka Video.

 బైక్‌ షోరూమ్‌లో స్మార్ట్‌ దొంగలు.. వీళ్ల తెలివికి ఆస్కార్‌ ఇచ్చినా తక్కువే.!షాక్ లో ఓనర్స్..:Smart thieves in bike showroom Video.

 ఒలంపిక్స్ క్లోజింగ్ అదిరింది..!ఈ ఒలింపిక్స్.. భారత్‌కు చాలా స్పెషల్ గురూ.. ఎందుకో తెలుసా..?:Tokyo Olympics 2021 video.