Nayanatara: రింగ్ చూపిస్తూ అసలు విషయం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. రూమర్స్‏కు చెక్ పెట్టినట్టేనా ?

Nayanatara: దక్షిణాది స్టార్ హీరోయిన్స్‏లలో నయనతార ఒకరు.. ఈ అమ్మడు కేవలం సినిమాలతోనే కాకుండా.. ప్రేమ వ్యవహారాలతో

Nayanatara: రింగ్ చూపిస్తూ అసలు విషయం చెప్పిన లేడీ సూపర్ స్టార్..  రూమర్స్‏కు చెక్ పెట్టినట్టేనా ?
Nayantara
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 11, 2021 | 3:30 PM

Nayanatara: దక్షిణాది స్టార్ హీరోయిన్స్‏లలో నయనతార ఒకరు.. ఈ అమ్మడు కేవలం సినిమాలతోనే కాకుండా.. ప్రేమ వ్యవహారాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. గత నాలుగేళ్లుగా తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‏తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ తమిళ్ మీడియా వర్గాల్లో ఎన్నో కథనాలు వెల్లడయ్యాయి. అయితే నయన్ మాత్రం ఇప్పటివరకు విఘ్నేష్ శివన్‏తో ప్రేమయాణం, పెళ్లి గురించి ఎక్కడా స్పందించలేదు. తాజాగా ఓ మూవీ ప్రమోషన్‏లో భాగంగా.. నయన్.. తన ప్రేమ, పెళ్లి గురించి ఒపెన్ అయ్యింది.

Nayan

Nayan

ఈ సందర్భంగా నయన్ మాట్లాడుతూ.. తనకు నిశ్చితార్థం జరిగిందని చెబుతూ వేలికి ఉన్న ఉంగరం చూపించి అందరికి షాకిచ్చింది. అయితే గతంలో విఘ్నేష్ శివన్ గుండెల మీద చేయి వేసి రింగ్ ఉన్న ఫోటోను హైలేట్ చేస్తూ నయన్ ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ అది ఎంగేజ్‏మెంట్ రింగ్ అయి ఉంటుందని భావించారు. ఇక అందరి సందేహాలను నిజం చేస్తూ.. తాజాగా నయన్ తనకు నిశ్చితార్థం అయ్యిందని ప్రకటించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నయన్‏కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం నయన్ నెత్రికన్‏లో ప్రధాన పాత్రలో నటిస్తుంది. మిలింద్ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజ్మల్ విలన్‎గా నటిస్తుండగా.. నయన్ అంధురాలి పాత్రలో నటిస్తుంది. ఆగస్ట్ 13న ఓటీటీ ప్లాట్‏ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో ఈ మూవీ విడుదల కానుంది.

Also Read: Priyanka Jawalkar: ఇదే చేయాలని అనుకోను.. నాకు నచ్చిన పాత్ర ఏదైనా చేస్తాను..

Viral Video: స్టన్నింగ్‌ స్టంట్‌ చేద్దాం అనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Bellamkonda Sreenivas: కొత్త మూవీని అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ‘స్టూవర్ట్‌‌‌పురం దొంగ’గా బెల్లంకొండ శ్రీనివాస్..

Viral Pic: కుంగ్ ఫూ స్టైల్‌లో ఫోజిచ్చిన ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. కనిపెట్టండి!