Vaishnav Tej: కొత్త సినిమా షూరు చేసిన మెగా యంగ్ హీరో.. డైరెక్టర్ ఎవరంటే..
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇందులో

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇందులో వైష్ణవ్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే వైష్ణవ్‌కు ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్‌ను తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్ పై బీవీఎస్ఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ మంగళవారం పూజా కార్యక్రమాలు జరిపి స్టార్ట్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ మాట్లాడుతూ.. ఉప్పెన సినిమాతో యువతకు దగ్గరైన వైష్ణవ్ తేజ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసే కథతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నాము. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరీశాయ ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడని అన్నారు. ఈ మూవీలో వైష్ణవ్‌కు జోడీగా కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ట్వీట్..
Lights! Camera! & Action #Vaisshnav3 First Day Shoot Commenced Today ?@ketikasharmaa @GIREESAAYA @ThisIsDSP @Shamdat2 @BvsnP @SVCCofficial @vamsikaka pic.twitter.com/RIs33u3j5Z
— Panja Vaisshnav Tej (@VaisshnavTej) August 10, 2021
Also Read: Nayanatara: రింగ్ చూపిస్తూ అసలు విషయం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. ఇంతకీ పెళ్లెప్పుడో ?
Allu Arjun: త్వరలో పట్టాలెక్కనున్న ‘ఐకాన్’ మూవీ.. అల్లు అర్జున్‌కు జోడీగా మరోసారి ఆ భామ..