Bellamkonda Sreenivas: కొత్త మూవీని అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ‘స్టూవర్ట్‌‌‌పురం దొంగ’గా బెల్లంకొండ శ్రీనివాస్..

బెల్లం కొండ శ్రీనివాస్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. అల్లుడుశ్రీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో. మొదటి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు..

Bellamkonda Sreenivas: కొత్త మూవీని అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. 'స్టూవర్ట్‌‌‌పురం దొంగ'గా బెల్లంకొండ శ్రీనివాస్..
Bellamkonda Srinivas
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 11, 2021 | 1:47 PM

Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ హిట్ కొట్టి చాలాకాలం అయ్యింది. అల్లుడుశ్రీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. మొదటి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఆ తరువాత శ్రీనివాస్ హిట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తూవచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం అందుకోలేక పోయాడు ఈ కుర్రహీరో. ఇక రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాక్షసుడు సినిమా బెల్లంకొండకు ఉరటనించింది. తమిళ్ సినిమాకు రీమేక్‌‌‌గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నటన పరంగాను మెప్పించాడు శ్రీనివాస్. ఇటీవలే బాలీవుడ్‌‌‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు ఇప్పుడు తెలుగులో ఓ బయోపిక్‌‌‌లో చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.

గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌‌‌ను తెరకెక్కించబోతున్నట్లుగా గత కొన్ని ఏళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు దొంగ అయినా కూడా స్థానికులు ఆయన్ను ఓ హీరోగా కీర్తించేవారు. పోలీసులు ఆయన్ను పట్టుకునేందుకు కొన్ని వందల సార్లు ప్రయత్నాలు చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ఇదే కథతో వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌‌‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు స్టూవర్ట్‌‌‌పురం దొంగ అనే టైటిల్‌‌ను అనౌన్స్ చేశారు.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.Tiger

మరిన్ని ఇక్కడ చదవండి : 

క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన స్టార్ హీరో.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ…

Sandeep Reddy Vanga: మహేష్‌‌‌‌‌‌తో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. ఫ్యాన్స్‌‌‌కు పూనకాలే

F3 : ‘ఎఫ్‌ 3’ హంగామా..! రేచీకటితో వెంకటేశ్‌, నత్తితో వరుణ్‌ తేజ్‌.. ఇక నవ్వులే నవ్వులు