Viral Video: స్టన్నింగ్‌ స్టంట్‌ చేద్దాం అనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

సినిమా షూటింగ్‌ సరదాగానే సాగొచ్చు కానీ.. ప్రమాదాలు కూడా నీడలా పొంచి ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాల మీదకు రావొచ్చు.

Viral Video: స్టన్నింగ్‌ స్టంట్‌ చేద్దాం అనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 11, 2021 | 1:32 PM

Viral Video: సినిమా షూటింగ్‌ సరదాగానే సాగొచ్చు కానీ.. ప్రమాదాలు కూడా నీడలా పొంచి ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాల మీదకు రావొచ్చు. స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్ సంగతి సరే.. స్టంట్ల విషయంలో మరింత కేర్ అవసరం. ఏమాత్రం పట్టు వీడినా.. లెక్క తప్పినా.. గడబిడ గందరగోళమే. ముంబై ఫిల్మ్‌ సిటీలోని ఖండాలా రోడ్‌లో ఓ సినిమా షూటింగ్‌ జరిగింది. అక్కడ జరిగిన ఓ పల్టీ సీన్‌.. సినిమా యూనిట్ వెన్నులో వణుకు పుట్టించింది. ఖాండాలా రోడ్‌లో ‘ది గర్ల్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఓ స్టంట్ సీన్ షూట్‌ చేయాలని యూనిట్ డిసైడ్ అయింది. వేగంగా వస్తున్న ఓ కారు ఉన్నట్టుండి పల్టీలు కొడుతూ ఆగిపోవాలి. అలాగే జరగాలని అంతా సిద్ధం చేసుకున్నారు. అనుకున్నట్టే కారు వేగంగా వస్తూ పల్టీలు కొట్టింది. కానీ ఆగాల్సిన చోట ఆగకుండా యూనిట్‌ పైకి కారు దూసుకెళ్లింది.

స్పీడ్‌గా వచ్చిన కారు రెండు పల్టీలు కొడుతూ ఆగిపోవాలి. కానీ కారు స్పీడ్‌ అదుపులోకి రాకుండా టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. భారీగా శబ్దం రావడంతో యూనిట్‌ అంతా ఏం జరుగుతుందోనని ప్రాణ భయంతో పరుగుపెట్టారు. అంతలోనే కెమెరా అసిస్టెంట్ స్పృహతప్పి కింద పడిపోయాడు. వెంటనే ఆతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఈ నెల10న సాయంత్రం మూడు గంటల సమయంలో జరిగింది. మొత్తానికి స్టన్నింగ్‌ స్టంట్‌.. అందరికి షాకిచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన స్టార్ హీరో.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ…

Sandeep Reddy Vanga: మహేష్‌‌‌‌‌‌తో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. ఫ్యాన్స్‌‌‌కు పూనకాలే

F3 : ‘ఎఫ్‌ 3’ హంగామా..! రేచీకటితో వెంకటేశ్‌, నత్తితో వరుణ్‌ తేజ్‌.. ఇక నవ్వులే నవ్వులు