Adipurush : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ ఫాన్స్ .. ఆదిపురుష్‌‌‌ను ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..

ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఎదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రభాస్ వరుసగా భారీ పాన్ ఇండియా..

Adipurush : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ ఫాన్స్ .. ఆదిపురుష్‌‌‌ను ట్రెండ్  చేస్తున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 11, 2021 | 11:44 AM

Adipurush : ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఎదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రభాస్ వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఆయా సినిమాల షూటింగ్‌‌‌‌ను డార్లింగ్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తోన్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌‌‌ను కంప్లీట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమాను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు రెబల్ స్టార్. ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌‌తోనే అంచనాలను భారీగా పెంచేశాడు ప్రశాంత్. సలార్ మూవీలో ప్రభాస్ మాఫియా డాన్‌‌‌‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌‌‌గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌‌లు ఉండనున్నాయట. ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌‌‌‌తో సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఆదిపురుష్ అనే టైటిల్‌‌‌‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రామాయణ నేపథ్యంలో ఉండనుందని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడట. అలాగే స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ లంకేశ్‌‌‌గా కనిపించనున్నాడు. సీతగా అందాల భామ కృతినన్ నటిస్తోంది.

అయితే ఇప్పుడు ఆదిపురుష్ సినిమా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. నేడు ఎలాంటి అప్డేట్ లేదు. కనీసం ఏ చిన్న లీక్ కూడా రాలేదు అయినా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఆదిపురుష్. ప్రభాస్ అభిమానులు ఎందుకు ఆదిపురుష్‌‌‌‌ను ట్రెండ్ చేస్తున్నారంటే .. ఈ సినిమా రిలీజ్‌‌‌‌కు సరిగా ఏడాది ఉంది. ఆదిపురుష్ రిలీజ్ డేట్‌‌‌‌ను ఇప్పటికే అఫీషియల్‌‌‌‌గా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్.  ఆగస్టు 11 2022న ఆదిపురుష్ రిలీజ్ కాబోతుంది. నేటినుంచి సరిగ్గా ఏడాదికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ఇలా సంవత్సరం ముందునుంచే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆదిపురుష్ ను ట్రెండ్ చేస్తున్నారు.

Adipurush

 మరిన్ని ఇక్కడ చదవండి : 

క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన స్టార్ హీరో.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ…

Sandeep Reddy Vanga: మహేష్‌‌‌‌‌‌తో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. ఫ్యాన్స్‌‌‌కు పూనకాలే

F3 : ‘ఎఫ్‌ 3’ హంగామా..! రేచీకటితో వెంకటేశ్‌, నత్తితో వరుణ్‌ తేజ్‌.. ఇక నవ్వులే నవ్వులు