Raj Kundra Case: రాజ్ కుంద్రాకు బెయిల్ వద్దేవద్దు.. బెయిల్ ఇస్తే దేశం విడిచి ఎస్కేప్ కావొచ్చు!

Raj Kundra Case: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు బెయిల్ ఇవ్వొద్దంటూ ముంబై పోలీసులు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు.

Raj Kundra Case: రాజ్ కుంద్రాకు బెయిల్ వద్దేవద్దు.. బెయిల్ ఇస్తే దేశం విడిచి ఎస్కేప్ కావొచ్చు!
Raj Kundra
Follow us

|

Updated on: Aug 11, 2021 | 5:38 PM

Raj Kundra Case: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు బెయిల్ ఇవ్వొద్దంటూ ముంబై పోలీసులు.. కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. కుంద్రాకు బెయిల్ మంజూరు చేస్తే దేశం విడిచి పారిపోయే అవకాశముందని, అలాగే పోర్నోగ్రఫీ నేరాన్ని కొనసాగించే అవకాశముందంటూ పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు. పోర్న్ కేసులో రాజ్ కుంద్రా, అతని సన్నిహితుడు ర్యాన్ తోర్ప్‌ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు జులై 19న అరెస్టు చేయడం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను దిగువ మేజిస్ట్రేట్ కేసు ఇప్పటికే తోసిపుచ్చింది. బెయిల్ కోసం వారు అడిషిషనల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా..బెయిల్ పిటిషన్లపై పోలీసుల వైఖరి తెలియజేయాలని కోరుతూ కోర్టు ఆదేశించింది.

రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు.. కుంద్రాను బెయిల్‌పై విడుదల చేస్తే అశ్లీల వీడియోల తయారీని కొనసాగించే అవకాశముందని తెలిపారు. ఇది మన సంస్కృతిపై దుష్ప్రభావం చూపడంతో పాటు సమాజానికి చెడు సంకేతాలు పంపే అవకాశముందన్నారు. రాజ్ కుంద్రాకు బ్రిటన్ సిటిజన్‌షిప్ ఉందని గుర్తుచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. బెయిల్‌పై బయటకు వస్తే దేశం వీడి బయటకు పారిపోయే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రదీప్ భక్షికి రాజ్ కుంద్రా సమీప బంధువంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజ్ కుంద్రా జైలు నుంచి బయటకు వస్తే..నేరం నుంచి తప్పించుకునేందుకు ఆయనకు ప్రదీప్ భక్తి సాయపడే అవకాశముందన్నారు. 19 కారణాలతో రాజ్ కుంద్రాకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు కోర్టుకు నివేధించారు.

రాజ్ కుంద్రా, ర్యాన్ బెయిల్ పిటిషన్లపై విచారణను కోర్టు ఈ నెల 20 నాటికి వాయిదావేసింది. దీంతో వారి జ్యుడిషియల్ కస్టడీని కూడా 14 రోజుల పాటు పొడగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.

Also Read..

సభ్య సమాజానికి తలవంపులు.. పోర్నోగ్రఫీ తయారీలో ఈ 15 దేశాలు పెద్ద తోపులు..

పంద్రాగస్టు వేళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన కేంద్రం.. సికింద్రాబాద్ ఏరియాలో హై అలర్ట్

తెరపైకి మరోసారి హీరోయిన్ భావన కిడ్నాప్ కేసు.. నటి కావ్య మాధవన్‏ను విచారిస్తున్న పోలీసులు..