Police Torture: పోలీస్ అరాచకం తట్టుకోలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడి సూసైడ్
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం జరిగింది. పోలీసులు వేధిస్తున్నారంటూ రాజమండ్రి రూరల్ పిడింగొయ్య గ్రామంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకి పోలీసులే కారణమని సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
Police harassment: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం జరిగింది. పోలీసులు వేధిస్తున్నారంటూ రాజమండ్రి రూరల్ పిడింగొయ్య గ్రామంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకి పోలీసులే కారణమని సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అనంతరం తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గతేడాది తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు మద్యం బాటిళ్లు తీసుకువస్తూ.. కృష్ణా జిల్లా చిలకల్లు చెక్‌పోస్టు వద్ద యువకుడు పిచ్చికి మజ్జి(మృతుడు) పోలీసులకు చిక్కాడు. ఏడాది నుంచి తనపై ఉన్న మద్యం కేసును లక్ష రూపాయలతో సెటిల్ చేసుకోవాలని శివ అనే కానిస్టేబుల్ వేధిస్తున్నాడని మజ్జి తన వీడియోలో ఆరోపించాడు.
లక్ష రూపాయలు చెల్లించకపోతే గంజాయి కేసులో ఇరికిస్తానని కానిస్టేబుల్ శివ బెదిరించినట్టు పిచ్చికి మజ్జి తన మరణవాంగ్మూలంలో పేర్కొన్నాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు యువకుడు కుటుంబ సభ్యులు తన సెల్ఫీ వీడియోలో వివరణ ఇచ్చాడు. కాగా, యువకుడిని చిత్రహింసలకు గురిచేసి, అతడి మనోధైర్యాన్ని దెబ్బతీసి.. ఆత్మహత్యకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.