VH Clarity : బీసీ బంధు కూడా పెట్టండి.. ఆ విగ్రహాన్ని విడుదల చేస్తే కేసీఆర్ అసలైన దళిత ప్రేమికుడని నమ్ముతాం: వీహెచ్

తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పెట్టినట్లే బీసీ బంధు అమలు చేయాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. బీసీలు కూడా ఆర్థికంగా పరిపుష్టి చెందాలంటే

VH Clarity : బీసీ బంధు కూడా పెట్టండి.. ఆ విగ్రహాన్ని విడుదల చేస్తే కేసీఆర్ అసలైన దళిత ప్రేమికుడని నమ్ముతాం: వీహెచ్
V Hanumantha Rao
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 11, 2021 | 5:07 PM

V Hanumanta Rao: తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పెట్టినట్లే బీసీ బంధు అమలు చేయాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. బీసీలు కూడా ఆర్థికంగా పరిపుష్టి చెందాలంటే హుజురాబాద్‌లో ప్రవేశ పెట్టబోతున్న దళిత బంధు తరహాలోనే రాష్ట్రమంతటా బిసి బంధు ప్రవేశపెట్టాలన్నారు వీహెచ్.

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఉన్నవి బడుగు బలహీనవర్గాల వారివే.. బీసీలను విస్మరిస్తే టీఆర్ఎస్‌కు హుజురాబాద్‌లో బుద్ధి చెబుతారంటూ వీహెచ్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అమలు చేయలేదంటే బీసీ బంధు కోసం రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వీహెచ్ హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని లాకప్‌లో పెట్టిన ఈ ప్రభుత్వం.. అంటూ వ్యాఖ్యలు చేసిన వీహెచ్.. ఆ విగ్రహాన్ని విడుదల చేస్తే అసలైన దళిత ప్రేమికుడు కేసీఆర్ అని నమ్ముతామని ప్రకటించారు.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఈబిసి బిలు ప్రవేశ పెట్టారు.. ప్రధాని ప్రవేశపెట్టిన బిల్‌లో కొత్తదనం ఏమీలేదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దమ్ముంటే కులాల వారీగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

Read also: Mobile Apps Cheating: యాప్‌లతో బి కేర్‌ ఫుల్.! RCC ఆన్ లైన్ యాప్‌తో కడప జిల్లాలో 15 కోట్ల రూపాయల మోసం