రెండు రోజుల ముందే ముగిసిన లోక్ సభ సమావేశాలు..స్పీకర్ చాంబర్ లో సమావేశమైన ప్రముఖులు

లోక్ సభ సెషన్ బుధవారం నిరవధికంగా వాయిదా పడింది. అనంతరం స్పీకర్ ఓంబిర్లా చాంబర్ లో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, హోం మంత్రి అమిత్ షా, లోక్ సభలో కాంగ్రెస్ సభా నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, ఇతర విపక్ష నేతలు ఈ మీట్ లో పాల్గొన్నారు.

రెండు రోజుల ముందే ముగిసిన లోక్ సభ సమావేశాలు..స్పీకర్ చాంబర్ లో సమావేశమైన ప్రముఖులు
Lok Sabha
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 11, 2021 | 8:03 PM

లోక్ సభ సెషన్ బుధవారం నిరవధికంగా వాయిదా పడింది. అనంతరం స్పీకర్ ఓంబిర్లా చాంబర్ లో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, హోం మంత్రి అమిత్ షా, లోక్ సభలో కాంగ్రెస్ సభా నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, ఇతర విపక్ష నేతలు ఈ మీట్ లో పాల్గొన్నారు. లోక్ సభ సెషన్ ముగిసిన అనంతరం సంప్రదాయం ప్రకారం ఇలా అంతా సమావేశం కావడం ఆనవాయితీగా వస్తోంది. ప్రజలకు సేవ చేయాలంటే చర్చలు, సంప్రదింపులను నేతలు ప్రోత్సహించాలని ఓంబిర్లా ఈ సందర్బంగా సూచించారు. నిజానికి లోక్ సభ సమావేశాలు ఈ నెల 13 తో ముగియవలసి ఉన్నాయి. అయితే రెండు రోజులు ముందే నిరవధికంగా వాయిదా పడ్డాయి. పెగాసస్, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలపై విపక్షాలు సభల్లో నిరసన తెలపడమే గాక..చర్చ లేకుండానే ప్రభుత్వం వివిధ బిల్లులను ఆమోదించిందని విమర్శించాయి. సుమారు నెల రోజుల సెషన్ లో లోక్ సభ కేవలం 21 గంటలు మాత్రమే పని చేసిందని, దీని ప్రొడక్టివిటీ 22 శాతమని స్పీకర్ తెలిపారు.

రాజ్యసభ నిన్న ప్రతిపక్షాల రభసతోవేడెక్కింది. కాంగ్రెస్ సభ్యుడొకరు రూల్ బుక్ ని సభాధ్యక్ష (చైర్మన్) స్థానం వైపు విసిరేయడం, కొందరు సభ్యులు టేబుల్ మీద కూర్చోవడం వంటి సంఘటనలతో చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. సభ పవిత్రతను దిగజార్చారని, నిద్ర లేని రాత్రి గడిపానని అంటూ ఆయన కంట తడిపెట్టారు. ఈ చర్యలను ఖండించడానికి కూడా తనవద్ద మాటలు లేవన్నారు. ఈ సెషన్ లో ఎక్కువగా విపక్షాలు పెగాసస్ వివాదంపైనే సభను స్తంభింపజేశాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే..

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో విరిగి పడిన కొండ చరియలు..11 మంది మృతి..30 మందికి పైగా గల్లంతు