Kawasaki Ninja 650: ఇండియా కవాసకి మోటార్ నుంచి సరికొత్త ద్విచక్ర వాహనం.. 649 సీసీతో విడుదల
Kawasaki Ninja 650: ప్రస్తుతం ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎన్నో రకాల బైక్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో అంతంత మాత్రంగానే ఉన్న బిజినెస్..
Kawasaki Ninja 650: ప్రస్తుతం ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎన్నో రకాల బైక్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో అంతంత మాత్రంగానే ఉన్న బిజినెస్.. ప్రస్తుతం కరోనా తగ్గముఖం పట్టడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వివిధ ద్విచక్ర వాహనాల కంపెనీలు కొత్త కొత్త బైక్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా కవాసకి మోటార్(ఐకేఎం) మరో సరికొత్త బైక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని నింజా 650, 2022 ఎడిషన్‌ను బుధవారం విడుదల చేసింది. దీని ధర రూ.6.61 లక్షలు(ఎక్స్‌షోరూం దిల్లీ)గా నిర్ణయించింది.
ఇక కొత్తగా విడుదల చేసిన ఈ 2022 ఎడిషన్ బైక్.. పర్ల్ రొబోటిక్ వైట్, లైమ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. 2021 ఎడిషన్‌తో పోలిస్తే తాజా ఎడిషన్ ధర రూ.7,000 అధికమనే చెప్పాలి. మెకానికల్‌గా పెద్దగా మార్పులేమీ చేయలేదు. సెప్టెంబరు నుంచి వీటిని వినియోగదారులకు అందజేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇక ఈ బైక్ 649 సీసీ, ప్యారలల్ ట్విన్, లిక్విడ్ కూల్ ఇంజిన్ 67.4 బీహెచ్‌పీ పవర్, 64ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 15 లీటర్ల ఇంధన ట్యాంక్ గల ఈ బైక్ బరువు 196 కిలోలు. కంపెనీ షోరూంలలో ఇప్పటికే ఈ బైక్ బుకింగ్‌లు ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది.